పోలీసులు నిర్భంచిందిన రాకేష్ తల్లిదండ్రులను విడుదల చేయాలి

 


  కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపత్ పథకాన్ని, రైల్వే పొలీసులు కాల్పులు జరిపి ఇద్దరు యువకుల ప్రాణాలు తీయటాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండించింది.

మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు  గొర్రెపాటి మాధవరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

కాల్పులలో చనిపోయిన రాకేష్ తల్లి దండ్రులను భందువులను పోలీసులు పోలీస్ స్టేషన్లలో నిర్భందించారని వారిని వుడుదల చేాలని డిమాండ్ చేశారు.

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపత్ పథకం ద్వారా నష్టపోతున్నామని ఆందోళనకు గురైన వేలాది మంది ఆర్మీ ఉద్యోగ అర్హులు చేసిన ఆందోళనను అదుపు చేయడంలో భాగంగా రైల్వే పోలీసులు, రాష్ట్ర సివిల్  పోలీసులు అతిగా వ్యవహరించి, మనుషుల ప్రాణాలంటే విలువలేకుండా కాల్పులు జరిపి ఇద్దరు ప్రాణాలు తీయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.   ఆందోళనకారులపైకి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీయటంతోపాటు, 13 మంది దేహాల్లో బుల్లెట్లు దించటం అనేది అత్యంత అనాగరిక మన్నారు. మృతుల్లో ఒకరైన దామెర రాకేష్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని దబ్బెటి పేట గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు. అతని మృతదేహాన్ని వరంగల్ మీదుగా స్వగ్రామానికి తరలించే క్రమంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మృతుని తల్లిదండ్రులు బంధువులు నిరసన లాంటిదేమైనా చేస్తారేమోనని అనుమానంతో నర్సంపేట పోలీసులు మృతుని తల్లిదండ్రులను, బంధువులను, మిత్రులను ఇంటి దగ్గర నుంచి తరలించి వేరువేరు పోలీసు స్టేషన్లలో నిర్బంధించారనితెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అలవాటుగా చేసిన ఈ హీనమైన ముందస్తు నిర్బంధాన్ని అపేసి తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక కోటి రూపాయల చొప్పున రెండు కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా తక్షణమే ప్రకటించాలని,  విచక్షణ లేని కాల్పులు జరిపి యువకుల ప్రాణాలు తీసిన పోలీసులపై హత్యా కేసు నమోదు చేయాలని , రాకేష్ తల్లిదండ్రుల, బంధువుల పట్ల అమానవీయంగా వ్యవహరించి అక్రమంగా నిర్బంధించిన నర్సంపేట పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు.

 గత మూడు రోజులుగా దేశంలో, రాష్ట్రంలో లక్షలాది మంది యువకుల జీవితాల్లో మంటలు రేపిన కేంద్ర ప్రభుత్వం తన మతిలేని పథకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు.

 యువకుల ఆందోళనలను అదుపు చేసే పేరుతో అతిగా వ్యవహరిస్తూ వారి ప్రాణాలను తీస్తున్న  కేంద్రప్రభుత్వంతక్షణం దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు.

    

        

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు