తెలంగాణను జీరో నుండి హీరో చేసిన ఘ‌న‌త‌ కేసీఆర్‌దే: వాటర్ మ్యాన్ రాజేంద‌ర్ సింగ్

 




తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన సాగునీటిపారుదల ప్రాజెక్ట్ లు అద్భుతమ‌నీ, సీఎం కేసీఆర్ తెలంగాణ ను జీరో నుండి హీరో చేశార‌ని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద‌ర్ సింగ్ ప్రసంశించారు. గడిచిన 7 సంవత్సరాలుగా అంచలంచలుగా దేశంలోనే రోల్ మెడల్ గా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నీటి పారుదల విషయంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణ‌ను అనుస‌రించాలని అన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను చూసి ఎంతో  నేర్చుకోవాలని రాజేంద‌ర్ సింగ్ సూచించారు. 

రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ది చేసిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కు ద‌క్కుతోంద‌నీ, కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు అన్ని రాష్ట్రాలు అనుసరించాల‌ని అన్నారు.  సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేర‌కు వాటర్ యూనివర్సిటీ నెలకొల్పాలనీ, వ్యవసాయానికి, ఇతర రంగాలకు క్ర‌మం త‌ప్ప‌కుండా నీటిని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాన‌ని రాజేంద‌ర్ సింగ్ పేర్కొన్నారు. 

సీఎం కేసీఆర్ చేప‌ట్టిన హరిత హారం కార్య‌క్ర‌మం చాలా గొప్ప‌ద‌నీ, అలాగే.. ఇంటింటికి త్రాగు నీరు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేయడం గొప్ప విషయమ‌నీ హర్షం వ్య‌క్తం చేశారు. తెలంగాణలో ఎక్కడా ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు అందించే పరిస్థితి లేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం హర్షణీయమ‌నీ, రాష్ట్రంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు ల నిర్మాణము కొనసాగుతున్నందున రాష్ట్రంలో వాటర్ యూనివర్సిటీ నెలకొల్పాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశార‌ని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం నదులను అనుసంధానం చేయడం  సరికాదని అన్నారు.

త్వ‌ర‌లోనే  రివర్ లిటరసీ మూవ్‌మెంట్‌ను ప్రారంభం చేస్తున్నామ‌ని, ఇందులో  ప్ర‌తి ఒక్క‌రూ భాగస్వాములు కావాలని రాజేంద‌ర్ సింగ్ పిలుపునిచ్చారు. నీటికి సంబంధించి మ్యానిఫెస్టోను జాతీయ సదస్సులో విడుదల చేస్తామని తెలిపారు.  సుప్రీంకోర్టు ఆదేశాల‌తో 1992లో 25 వేల మైనింగ్ కంపెనీలు మూసివేశారనీ, తరువాత నుంచి భూగర్భ జలాలు ఉబికి వచ్చి నీటి సమస్య పరిష్కారం అయింద‌ని రాజేంద‌ర్ సింగ్ గుర్తు చేశారు. వ్యవసాయ రంగం కు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమ‌ని ప్రశంసించారు. 
 
అలాగే..  యాదాద్రి ఆల‌య పున‌ర్నిర్మాణం చాలా అద్భుతంగా ఉంద‌నీ,  సర్వాంగ సుందరంగా దేవాలయాన్ని తీర్చిదిద్దారనీ,  యాదాద్రి ఆలయ నిర్మాణం చరిత్రలో నిలుస్తోందని రాజేంద‌ర్ సింగ్ కొనియాడారు. మూడు చెరువుల నుంచి దేవాలయానికి నీరు సరఫరా చేస్తున్నారు. ప్రకృతిని ప్రేమిస్తే మనుషులకు బలమైన శక్తి సిద్ధిస్తుంది. దేశానికి సీఎం కేసీఆర్ రోల్ మెడల్ అని రాజేంద‌ర్ సింగ్ చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు