ఏపి మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

 


ఏపీ కి చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) హఠాన్మరణం చెందాడు.  సోమవారం ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా  చికిత్స పొందుతూ చనిపోయారు. మంత్రి మరణ వార్తను అధికారికంగ ధృవీఖరించారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్ రెడ్డిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌతమ్ రెడ్డి మరణించాడని అధికార వర్గాలు తెలిపాయి. గౌతమ్ రెడ్డి ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్ పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న అనంతరం నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున ఆయన విజయం సాధించారు.

జగన్ తీవ్ర దిగ్ర్భాంతి
మంత్రి మృతిపై సిఎం జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు గౌతమ్ రెడ్డి హఠాత్ మరణం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు