మేడారం సందర్శించిన గవర్నర్

 

తన రాక సందర్బంగా క్యూలైన్ల నిలిపి వేృయంతో  అధికారులపై అగ్రహం

భక్తులను క్షమాపణలు కోరిన గవర్నర్


మేడారం సందర్శించిన గవర్నర్

తన రాక సందర్బంగా క్యూలైన్ల నిలిపి వేృయంతో  అధికారులపై అగ్రహం

భక్తులను క్షమాపణలు కోరిన గవర్నర్

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర శనివారంతో ముగిసింది.  రాష్ర్ట గవర్నర్ తమిళిసై  శనివారం జాతర సందర్శించి అమ్మవార్లకు మొక్కలు సమర్పించారు. గవర్నర్ రాక సందర్భంగా పోలీసులు క్యూలైన్లలో భక్తుల దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు ఆసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం గవర్నర్ దృష్టికి రావడంతో అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. తన కోసం భక్తులను ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చిందని  ప్రశ్నించారు. ఇది సరైన పద్దతికాదని అన్నారు. తన కారణంగా అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నానంటూ భక్తులకు క్షమాపణలు చెప్పారు. 

భారి సంఖ్యలో భక్తులు  హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారని తాను కూడ భక్తులతో పాటు అమ్మవార్లను దర్శించుకున్నానని తెలిపారు.

గిరిజన ప్రజలందరి సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న తర్వాత గవర్నర్ మీడియాతో మాట్లాడారు. అమ్మ దీవేనలు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నానని తమిళిసై తెలిపారు. 

సావనీర్ ఆవిష్కరించిన గవర్నర్

మేడారం జాతర, 2022 ను పురస్కరించుకుని సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన ప్రత్యేక సంచిక (సావనీర్) ను ప్రెస్ మీట్ లో ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఎమ్మెల్యే సీతక్క సమాచార  శాఖ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు