టిడిపి ఎమ్మెల్సి అశోక్ బాబు అరెస్ట్

 


సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘాల జేఎసి నేతగా పనిచేసి  రాష్ట్ర విభజనానంతరం  తెలుగు దేశం పార్టి నుండి ఎమ్మెల్సి అయిన  అశోక్ బాబు ను ఎపి సిఐడి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసారు. గుంటూరు సిఐడి కార్యాలయంలో అశోక్ బాబు ను చాలా సేపు విచారించారు. ఇతకి ఇతన్ని ఏ కేసులో అరెస్చు చేసారో తెలిస్తే అందరూ ఆశ్చర్య పోతారు. దొంగ డిగ్రి సర్టిఫికేట్ కేసులో అరెస్టు చేసారు. వాస్తవంగా ఈ కేసు గతంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగిన సమయంలో అశోక్ బాబు పై ఫిర్యాదులు వచ్చాయి. ప్రమోషన్ కోసం ఆయన దొంగ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టాడని ఫిర్యాదు రాగా కొద్ది రోజుల పాటు విచారణ జరిగింది. అయితే ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండి ఆయన కన్నుసన్నల్లో తెలంగాణ ఉద్యమానికి కౌంటర్ ఉద్యమం కొనసాగించిన అశోక్ బాబు కేసు ఆయన ఆశీస్సులతో అర్దాంతరంగా మూత పడింది. 

అశోక్ బాబు అరెస్టు ను నిరసిస్తు తెలుగు దేశం పార్టి నేతలు పలు చోట్ల నిరసన తెలిపారు. అశోక్ బాబు బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. 

అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో పని చేసినప్పుడు బీకాం చదవకపోయినా తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని మెహర్ కుమార్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త, సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక్‌ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా, గత నెల 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయింది. దీంతో అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ పోలీసులు. దీంతో 2022, ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి విజయవాడలోని అశోక్ బాబు ఇంటికి వెళ్లిన సీఐడీ పోలీసులు అర్ధరాత్రి నోటీసులు అంటించారు. అనంతరం అశోక్ బాబును అదుపులోకి తీసుకున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు