బిజేపీ లో చేరిన తెలంగాణ ఉద్యమ కారుడు విఠల్


 రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెక్ పెట్టేందుకు  భారతీయ జనతా పార్టి  పకడ్బంది వ్యూహంతో అడుగులేస్తోంది.  వచ్చే అసెంబ్లి ఎన్నికలు లక్ష్యంగా చేసుకుని పార్టీని బలోపేతం చేసేందుకు ఆకర్ష్ పథకం షురూ చేసారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను పార్టీ లేకి ఆహ్వానించేపనిలే పడ్డారు. 

తెలంగాణ ఉద్యమకారుడు, పబ్లిక్ సర్వీస్ కమీషన్ మాజి సబ్యుడు  సిహెచ్ విఠల్  బీజేపీ లో చేరాడు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ముక్తార్ అబ్సాస్ నఖ్వీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ పార్టి తెలంగాణ చీఫ్ బండి సంజయ్, ఎఁపి ధర్మపురి అరవింద్ ల సమక్షంలో చేరి ప్రాథమిక పార్టి సభ్యత్వం పుచ్చుకున్నారు. ఈసందర్బంగా బండిసంజయ్ మాట్లాడుతు  విఠల్  చేరికను స్వాగతిస్తున్నామని అన్నారు. ఉద్యమకారులపై సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఈ చేరికలు జరుగుతున్నాయన్నారు. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు తెలంగాణలో బీజేపీ చేస్తున్న పోరాటానికి కలసిరావాలని పిలుపునిచ్చారు. 

విఠల్ మాట్లాడుతూ ఈ రోజు జీవితంలో మరపురాని రోజని, అంబేద్కర్ జయంతి, రామమందిర నిర్మాణం కోసం కరసేవకులు బలిదానం చేసిన రోజున సొంత ఇల్లు బీజేపీకి రావడం సంతోషంగా ఉందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయడంలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు, మహిళలు, విద్యావంతులకు సరియైన గౌరవం లేదన్నారు. తెలంగాణ వచ్చినంక 7 ఏళ్లలో 600 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. తెలంగాణ లో  2023లో  బీజేపీ అధికారంలోకి వస్తుందని విఠల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో విఠల్ జేఏసీ ప్రధాన కార్యదర్శిగా, కో-చైర్మన్‌గా పని చేశారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ సబ్యుడిగా విఠల్ పనిచేశారు. ఆయ పదవి కాలం ముగిసిన తర్వాత చైర్మన్ పదవి ఇస్తారని  లేదా  ఎమ్మెల్సి పదవో ఇతరత్రా నామినేటెడ్ పోస్టో ఇస్తారని భావించారు. సిఎం కెసిఆర్ విధానాలు నచ్చని  విఠల్ అనేక మార్లు అసంతృప్తి వ్యక్తం చేసారు. ఉద్యోగాల నియామకాల విషయంలో ప్రభుత్వ తీరుపై కూడ అసహనం వ్యక్తం చేశారు. 

జర్నలిస్టు తీర్మార్ మల్లన్న మంగళవారం బిజెపీలో చేరనున్నారని బండిసంజయ్ తెలిపారు. తీన్మార్ మల్లన్న టీం కూడ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇక వరుసగా బిజెపీలో చేరికలు  ఉంటాయని ఆ పార్టి నేతలు చెబుతున్నారు. జిల్లాల వారీగా చేరికలు ఉంటాయని భావిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు