కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావులను కట్టేసి కొట్టిస్తా - తీన్మార్ మల్లన్న

 

బిజెపీలో చేరిన తీన్మార్ మల్లన్న 

''నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు.. 15 మీటర్ల తాడు. ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావును కట్టేస్తా.. అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా... ప్రపంచంలోనే అత్యంత మోసకారి కేసీఆర్.  ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి. తాడు తీసుకొచ్చేందుకే నేను ఢిల్లీకి వచ్చాను " అని జర్నలిస్ట్ చింతపండు నవీన్ ఏలియాస్  తీన్మార్ మల్లన్న అన్నారు.

మంగళవారం ఢిల్లీలో బిజెపి కేంద్ర పార్టి కార్యాలయంలో మల్లన్న  తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ పార్టి రాష్ర్ట అద్యక్షులు బండి సంజయ్ ల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సంద్బంగా  మల్లన్న మాట్లాడుతు తాడు తీసుకొచ్చేందుకే  ఢిల్లీకి వచ్చా నని అన్నారు. తనపై  38 కేసులు పెట్టారని  అయినా ఏం సాధించారు ప్రశ్నించారు. తనపై కైసులు చూసి  పోలీసులు బాధపడ్డారని  జడ్జీలు మదనపడ్డారని  అన్నారు. రాష్ట్రంలోని ఉద్యమకారులంతా ఒక్కటవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్‌పై పోరాడతామని మల్లన్న స్పష్టం చేశారు.

తరుణ్ చుగ్ మాట్లాడుతూ "సమస్యలపై పోరాడే నవీన్ కుమార్‌ను బీజేపీలోకి స్వాగతిస్తున్నాం. దేశంలో మార్పు రావాలంటే కలం ఎత్తాల్సిందే. కేసీఆర్ దోపిడీ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నవీన్ కుమార్ కలం ఎత్తారు. తెలంగాణా యువత తీన్మార్ మల్లన్న లైవ్ కోసం ఎదురు చూస్తుంటారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓట్లు సాధించారు. ప్రజా సమస్యలపై బీజేపీ నేతలు యాత్రలు చేస్తుంటే అధికార పార్టీ దాడులు చేస్తూ, కేసులు పెడుతోంది. ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది "  అని మండిపడ్డారు.

బిజెపి చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతు  మల్లన్న తన కలంతో గళమెత్తుతుంటే జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అక్రమ పోలీసు కేసులు బనాయించారని, అనేక విధాలుగా భయభ్రాంతులకు గురిచేసారని   విమర్శించారు. కెసిఆర్ వేదిస్తే  మలన్నకు బెజిపి అండగా నిలిచిందని అన్నారు. తెలంగాణలోని దుర్మార్గమైన పాలనను అంతమొందించాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తెలంగాణ ఉద్యమకారులు భావిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. విఠల్, మల్లన్న వంటి నేతలకు రాజకీయ స్వార్థం లేదని, తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ, అవినీతి, నియంత ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టాలని,చంద్రశేఖర్ రావు రాక్షస పాలనకు చరమగీతం పాడాలని, బీజేపీ చేపడుతున్న ఈ మహోద్యమానికి మద్దతు పలకాలని రాష్ట్రంలోని తెలంగాణ ఉద్యమకారులను కోరుతున్నానని బండి సంజయ్ అన్నారు. 

కార్యక్రమంలో ఎంపి అరవింద్ తో పాటు పార్టి నాయకులు రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు