పార్ బాయిల్డ్ రైస్‌ కొనుగోలు చేసే ప్రసక్తి లేదన్న కేంద్రం


 తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్  మహాధర్నా చేసిన రోజే కేంద్రం బియ్యం కొనుగోలుపై ప్రకటన చేసింది.  పార్ బాయిల్డ్ రైస్‌ కొనుగోలు చేసే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. రాష్ర్టం నుండి  60 లక్షల టన్నుల ధాన్యం, 40 లక్షల టన్నుల బియ్యం సేకరించేందుకు అంగీకారం తెలిపామని కేంద్రం పేర్కొంది. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయ బోమని గతంలో స్పష్టం చేశామని అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడ సమ్మతించిందని దేశంలో పారాబాయిల్డ్  రైస్ కు డిమాండ్ లేదని కేంద్రం తెలిపింది. 

 యాసంగి పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని పేర్కొంది. రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాత వచ్చే ఏడాది ఎంత సేకరించాలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.  బాయిల్డ్ రైస్  వినియోగించే రాష్ట్రాలు స్వయంగా సమకూర్చుకుంటున్నాయని ఇకపై సేకరణ కుదరదని పేర్కొంది. రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాత.. వచ్చే ఏడాది ఎంత సేకరించాలో నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయని.. అవకాశం ఉన్నంత వరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని కేంద్రం వివరణ ఇచ్చింది.

కేంద్రం బాయిలిడ్ రైస్ కొనుగోలు చేయాలని సిఎం కెసిఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసారు.  గురువారం ఇందిరా పార్కు వద్ద మంత్రులు ఎమ్మెల్యేలతో మహా ధర్నా నిర్వహించారు. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చారు.

తెలంగాణ రైతుల ప్రయోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర చేస్తామని ప్రకటించారు కేసీఆర్. సీఎం, మంత్రులు ధర్నా చేసే పరిస్థితిని కేంద్రమే తీసుకొచ్చిందన్నారు. అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నట్టే.. అంతకుమించిన పోరాటాలతో రైతాంగం ప్రయోజనాలు కాపాడుతామని రైతులకి భరోసానిచ్చారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ 51 గంటల దీక్ష చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం కళ్లు తెరిపించడానికే ఈ యుద్ధం చేస్తున్నామన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు