పార్లమెంట్ కు కల్వకుంట్ల కవిత

 రాజ్యసభ పదవి నుండి ఎమ్మెల్సీ పదవికి అనూహ్యంగా బండా ప్రకాశ్ పేరు

  ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో హఠాత్తుగా బండా ప్రకాశ్ పేరు చేరడం వెనక  కవితను పార్లమెంట్ కు పంపే  కెసిఆర్ వ్యూహం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ


ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారా ? తాజా రాజకీయ పరిణామాలు చూసి అవునని విశ్లేశిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో కవిత ఎమ్మెల్సి పదవి కాలం ముగియ నుంది. కవితను రాజ్యసభకు నామినేట్ చేయవచ్చనే చర్చ వెనక   బండా ప్రకాశ్ పేరు హఠాత్తుగా ఎమ్మెల్సి  అభ్యర్థుల జాబితాలో రావడమే.ఎవరూ ఊహించని రీతిలో  బండా ప్రకాశ్ ను ఎమ్మెల్సి కోసం ఖరారు చేయడం వెనక సిఎం కెసిఆర్ వ్యూహం ఇదేనని రాజకీయ వర్గాల విశ్లేషణ. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలిగా కవిత గతంలో పనిచేశారు. ఆమె రెండో సారి పోటి చేసి బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడి పోయారు. చాలా రోజులు ఏ పదవి లేకుండా  ఉన్న కవితకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. కవిత ఎమ్మెల్సి  పదవి కాలం రెండేళ్లే   కావడం వల్ల మరి కొద్ది రోజుల్లో ముగియనుంది.  ఎమ్మెల్యే కోటా నుండి ఆరుగురు ఎమ్మెల్సీలకు అభ్యర్థులను ఎంపిక చేశారు.

బండా ప్రకాశ్  మంగళవారం ఎమ్మెల్సి పదవికి నామినేషన్ కూడ వేశారు. బండా ప్రకాశ్ స్థానంలో కవితను రాజ్యసభకు పంపాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారని రాజకీయ వర్గాల్లో వార్త గుప్పు మంది. బండా ప్రకాశ్ ను పార్లమెంట్ నుండి తప్పించి  ఎమ్మెల్సీగా పంపడం వెనక మరో  వ్యూహం కూడ ఉన్నట్లు చెబుతున్నారు.  ముదిరాజ్ కమ్యునిటీకి చెందిన ఈటెల రాజేందర్ స్థానంలో అదే కమ్యునిటీకి చెందిన బండా ప్రకాశ్ ను ఎంపిక చేయడం ద్వారా  బిసి వర్గాలను  ఊరడించినట్లు అవుతుందని సిఎం కెసిఆర్ ఆలోచించి ఉండవచ్చంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్  గెలుపు కోసం బిసీలు  ఐక్యత కనబరిచారు. ప్రధానంగా రాష్ట్రంలో  హైదరాబాద్ మహా నగరంతో పాటు మూడు జిల్లాలలో ముదిరాజ్ కమ్యునిటి ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈటల రాజేందర్ ను పదవి నుండి తొలగించిన అనంతరం ఆ కమ్యునిటి వారంతా సిఎం కెసిఆర్ పై అగ్రహంతో ఉన్నారని ఇంటలిజెన్సు వర్గాల రిపోర్ట్స్ ఉన్నాయి. బండా ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎంపికైన అనంతరం  తదుపరి జరిగే మంత్రి వర్గ మార్పులు చేర్పులలో ఆయనకు మంత్రి పదవి ఖాయమని కూడ భరోసా కల్పించినట్లు చెబుతున్నారు. అయితే ఏం జరుగ బోతోందో నవంబర్ 23 నాటికి తేల నుంది.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవులకు  23 వరకు నామినేషన్ల దాఖలు చేసే  అవకాశం ఉంది. కవిత పార్లమెంట్ కు వెళతారా లేక తిరిగి ఎమ్మెల్సీగా పోటి చేసేందుకు నామినేషన్ వేస్తారా లేదా అనేది అప్పుడే తేలుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు