అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్

 

నినిజమైన నిజfp

నిజమైన బండి సంజయ్ భవిష్యవాణిహుజురాబాద్ లో గెలిచి సిఎం కెసిఆర్ కు అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తామని బిజెపి చీఫ్ బండి సంజయ్ చెప్పిన భవిష్యవాణి నిజమైంది. హోరా హోరీగా హుజురాబాద్ ఉప పోరులో తలపడిన బిజెపి తన సత్తా చాటుకుంది. అధికార టిఆర్ఎస్ పార్టి ఎన్ని రకాలుగా గెలుపు కోసం అడ్డదారులు దొక్కినా ఫలితం లేక పోయింది. బిజెపి గెలుపు టిఆర్ఎస్ పార్టీకి మింగుడు పడడం లేదు. ఈటల రాజేందర్ గెలుపుతో అసెంబ్లీలో బిజెపి బలం మూడుకు  చేరింది. బిజెపి ఎమ్మెల్యేల పేర్లన్ని ఆర్ అక్షరంతో ప్రారంభం కావడం ఇదే విషయం ఎన్నికల ప్రచారం సందర్భంగా బిజెపి బండి సంజయ్ ప్రస్తావించారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుస్తున్నాడని అసెంబ్లీలో ఇక సిఎం కెసిఆర్ కు ట్రిపుల్ ఆర్ (ఆర్ ఆర్ ఆర్) సినిమా చూపిస్తామని అన్నారు. 2018 ఎన్నికల్లో బిజెపి కేవలం కే ఒక సీటు గెలిచింది. బిజెపి ఎమ్మెల్యేగా రాజాసింగ్ నగరం నుండి గెలిచారు. దుబ్బాక ఉప పోరులో రుఘనందనరావు గెలిచారు.హుజురాబాద్  ఉప పోరులో ఈటల రాజేందర్ గెలిచి తన స్థానానాన్ని నిల బెట్టుకున్నారు.

బిజెపీకి ఇప్పుడు అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఉంది. వారినే బండి సంజయ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో పోల్చారు. 

హుజురాబాద్ లో  ఈ టల రాజేందర్ 20 వేల పై చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. సిఎం కెసిఆర్ నిర్జాక్షిణ్యంగా ఈటలను మంత్రి పదవి నుండి తొలగించారు. ఈటల భూ కబ్జాలకు పాల్పడ్డాడంటు కేసులు కూడ పెట్టి వేధించారు. దాంతో ఈటల బిజెపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ లో ఉప ఎన్నికలు జరిగాయి.

హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎంతో  ఉత్కంఠ కలిగించాయి. ఈటలను ఎట్లాగైనా ఓడించి తీరాలని  కెసిఆర్ పకడ్బంది ప్లాన్ తో తానే స్వయంగా వ్యూహ రచన చేసినా ఫలించ లేదు.  దళిత భందు వంటి ఓటర్ల ఆకర్షక పథకాలు కూడ ప్రభావం చూప లేక పోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు గత, మూడు నాలుగు నెలల నుండి  విరామం లేకుండా పని చేసినా ఈటల గెలుపును నిలువ రించ లేక పోయారు. ఎన్నడు లేనంతగా ఓటుకు ఆరు వేల నుండి 10 వేల వరకు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. 

హుజురాబాద్ లో అధికార టిఆర్ఎస్ పార్టి ఓటర్లను ప్రలోభ పెట్టిన తీరు చూసి మొదట్లో ఈటల గెలవడం చాలా కష్టమనుకున్నారు. కాని పోలింగ్ తేది దగ్గర పడ్డ కొద్ది ఈటలకు అనుకూలంగా మారాయి. ఉప పోరులో ఈటల  ఓడి పోతాడని ఆయన రాజకీయ జీవితం సమాప్తం కానుందనే ఊహాగానాలను పటా పంచలు చేస్తు  ఓటర్లు ఈటలను కాపాడుకుని ఘన విజయం చేకూర్చారు. హుజురాబాద్ ఉప పోరు ఫలితం అధికార పార్టీకి ఓ దిగ్భ్రాంతి అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈటల ముఖం అసెంబ్లీలో తాను చూడవద్దని సిఎం కెసిఆర్ ఎంతగా తలంచినా సఫలీ కృతుడు కాలేక పోయాడని చర్చ జరుగుతోంది. బిజెపి బలగం, ఈటల బలం రెండు గెలుపుకు తోడ్పడ్డాయి. సిఎం కెసిఆర్  నియంతృత్వ విధానాలు నచ్చని ప్రజా తంత్ర వాదులందరూ ఈటల గెలుపును కోరుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేయబోతున్నాయని విశ్లేషణలు జరుగుతున్నాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు