హుజురాబాద్ లో గెలుపు మాదే - బిజెపి చీఫ్ బండి సంజయ్

 

ఉప పోరులో గెలుపుపై బిజెపి నేతలు ధీమాతో ఉన్నారు. ఉత్కంఠగా జరిగిన పోలింగ్ లో బిజెపీకి అనgకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నారు

 హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతోందని భాజపా చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేసారు.  ఎన్నికల్లో అధికార పార్టి ధన ప్రవాహం బెడిసి కొట్టిందన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగు యవకులు  తమ వైపే నిలిచారన్నారు.   ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేశారు. పార్టీ గెలుపు కోసం నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారికి అన్నారు. 

హుజురాబాద్ పోలింగ్ లో భారీగా ఓటర్లు పోటెత్తడంతో ఓటింగ్ శాతం పెరుగింది. దాంతో బాజపాకే ఎక్కువగా అవకాశాలున్నాయని దాదాపు అన్ని సర్వేలు అంచనా వేసాయి. బిజెపి నేతల్లో గెలుపుపై  జోఫ్ పెరిగింది. 

ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో  మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అధికార యంత్రాంగం పనిచేసిందని విమర్శించాడు. ఓట్లను అడ్డగోలుగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా అసత్యపు ప్రచారాలు చేసిందని మండిపడ్డారు. 

టీఆర్ఎస్ తో' పోలిస్తే బీజేపీకి 9 నుంచి 10శాతం ఓట్లు ఎక్కువ వస్తాయన్నారు. సైలెంట్ ఓటింగ్

పనిచేస్తే మెజారిటీ మరింత పెరిగే చాన్స్ ఉందని తెలిపారు.

కేసీఆర్ అహంకారానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో ప్రజలు ఒక మంచి ఆలోచనతో బీజేపీ పార్టీని ఆదరించారన్నారు. బీజేపీ శ్రేణులు రాత్రిపగలు పార్టీ విజయం కోసం పాటుపడ్డారని. ప్రజలకు అవగాహన కల్పించారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో బీజేపీ శ్రేణులు మరింత కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు.

500 నుండి 600 కోట్లు ఖర్చు పెట్టారు

కెసిఆర్ తనను అసెంబిలీలో చూడకూడదని ఎన్నికల్లో 500 నుండి 600 కోట్లు ఖర్చు పెట్టాడని బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. అయినా హుజురాబాద్ ప్రజలు న్యాయం వైపు నిలబడ్డారని భారి మెజార్టీతో తనను గెలిపించ బోతున్నారని చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు