సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ కౌంటర్


కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలన్నారు. 

" చంద్రశేఖర్ రావు నాలుకకు  మెదడుకున్న నరం కట్ అయ్యినట్లుంది.. సీఎంకు సిగ్గుండాలి... ఆ భాషను చూసి జనం నవ్వుకుంటున్నరు.. ముఖ్యమంత్రి సెన్సార్ భాష వాడుతున్నడు. రండ, పిచ్చి గాడిద కొడుకులు, బేవకూఫ్, నా కొడకా...అంటూ మాట్లాడుతున్నడు.  తెలంగాణ సమాజానికి చంద్రశేఖర్ రావు నేర్పుతున్న భాష ఏంటి? . ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావుకు పిచ్చి ముదిరింది.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హద్దుమీరి దిగజారి కేంద్ర మంత్రి పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసారు.. చంద్రవేఖర్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలి... ఏది పడితే అది మాట్లాడితే జనం సహించరు.., సీఎం భాషను చూసి తన సహచరులు నవ్వుకుంటున్నరు.. బీజేపి నేతలు కూడా అట్లనే మాట్లాడితే చంద్రశేఖర్ రావు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు అంటూ బండి సంజయ్ ప్రశ్నించాడు. 

మెడపై కత్తి పెడితే ఫాం హౌస్ రాసిస్తారా?... ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. రా రైస్ పక్కాగా కొంటామని కిషన్‌రెడ్డి చెప్పారన్నారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఎలా బంద్ చేస్తారో చూస్తామన్నారు. వానాకాలం పంటను ఎలా కొంటున్నారో..అలానే యాసంగి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

పాకిస్థాన్ అంటే కేసీఆర్‌కు ఎందుకంత ప్రేమ? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ ఎక్కడ హత్యలు చేసిందో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. టీఆర్ఎస్ పాలనతో విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రా రైస్ కొనే బాధ్యత కేంద్రానిదేనని.. రాష్ట్రం కూడా కొని తీరాల్సిందేనన్నారు. వరి వద్దన్నారు.. మరి ఏ పంట వేయాలో చెప్పాలి కదా అని బండి సంజయ్ అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు