కేంద్రంపై మండిపడ్డ సిఎం కెసీఆర్


 కేంద్ర ప్ర‌భుత్వం  రైతు వ్య‌తిరేక విధానాల‌ను అవలంభిస్తోంద‌ని తెలంగాణ సిఎం కెసిఆర్ అగ్రహం వ్యక్తం చేసారు.  కోట్ల మంది బాధ్యతలను చూసే కేంద్రం.. ఓ చిల్లర కొట్టు యజమానిలా మాట్టాడుతోందని విమర్శించారు. 

" సాక్షాత్తూ ప్ర‌ధాన మంత్రే దేశంలోని రైతుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 750 మంది రైతుల‌ను పొట్ట‌న పెట్టుకున్న పార్టీ. హంత‌కుల పార్టీ. మీది రైతు రాబందు పార్టీ. వాస్త‌వం కాదా.. 750 మంది చ‌చ్చిపోలేదా. 13 నెల‌లు వాళ్లు ఎండ‌న‌కా.. వాన‌న‌కా.. క‌రోనాలో నిర‌స‌న‌ చేస్తే.. అప్పుడు ప‌ట్టించుకోకుండా.. ఇప్పుడు మాట్లాడుతున్నారా? మేము రైతు బంధువులం. మేము ప్రాజెక్టులు క‌ట్టాం. ఎల్లంప‌ల్లి, మిడ్ మానేరు, నెట్టెంపాడు, క‌ల్వ‌కుర్తి, భీమా, కోయిల‌సాగ‌ర్, దేవాదుల‌ ప్రాజెక్టులు ఎవ‌రు కంప్లీట్ చేశారు. అంత‌కుముందు ఈ ప్రాజెక్టుల‌న్నీ ద‌శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. వీళ్లు ముంచేవాళ్లు త‌ప్పితే మంచి చేసేవాళ్లు కాదు. తెలిపోయింది. ఇది 100 శాతం రైతు వ్య‌తిరేక పార్టీ" అని కేసీఆర్ అన్నారు.

వేసవిలో ధాన్యం కొనుగోళ్లు బంద్

రాష్ట్రంలో వేసవిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలిపారు. బాయిల్డ్‌ రైసును కొనబోమని కేంద్రం చేతులెత్తేసిందన్నారు. కనుక రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని.. పంటలసాగుపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. స్వంత వినియోగం, విత్తన కంపెనీలతో ముందస్తు ఒప్పందం కోసం వరి సాగు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం మాత్రం రైతుల నుంచి వరి కొనుగోలు చేయలదేని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు