దళిత భందు ఇంతటితో ఆగదు..గిరిజనులు, బిసీలకు కూడ -సిఎం కెసిఆర్


 ద‌ళిత బంధుతో బ‌ల‌హీన వ‌ర్గాల‌ను బ‌లోపేతం చేసే య‌జ్ఞం ఇంతటితో అగదని  గిరిజ‌నులు, బీసీలు, ఈ బీసీల్లో కూడా ఈ పథకం అమలు చేస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.  వ‌చ్చిన ఆదాయాన్ని ప్ర‌జ‌ల‌కు ఏదో రూపంలో పంచుతా మన్నారు.  అతి ఎక్కువ బాధ‌లో, దుఃఖంలో ఉన్న ప్ర‌జ‌ల‌కు ముందు మేలు చేస్తామని,  బ‌ల‌హీన వ‌ర్గాల‌కు వంద శాతం ఆదుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అప్పుడే గొప్ప‌ ఉంటుందని అన్నారు. ద‌ళిత బంధుకు రూ. ల‌క్షా 70 వేల‌ కోట్లు ఖ‌ర్చు పెట్టాల‌ని నిర్ణ‌యించా మని చెప్పారు . ఈ కార్య‌క్ర‌మాన్ని ఇక్క‌డితో ఆపబోమని  అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అమ‌లు చేస్తామని తెలిపారు.  భార‌త ద‌ళిత స‌మాజానికి తెలంగాణ ద‌ళిత స‌మాజం దిక్సూచి కావాలన్నారు. క‌ర్ణాట‌క‌లోని రాయ్‌చూర్ ప్ర‌జ‌లు కూడా తెలంగాణలో క‌లుస్తామ‌ని అంటున్నారని తెలంగాణ ప‌థ‌కాలు ఇతర రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నాయని అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

బిజెపి మాజి నేత మోత్కుపల్లి నర్సింహులు బిజెపీలో చేరిన సందర్భంగా సోమవారం తెలంగాణ  భవన్ లో కెసిఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌కు రాజ‌కీయాలు అంటే ఒక గేమ్.. కానీ టీఆర్ఎస్‌కు అట్ల కాదని  టీఆర్ఎస్‌కు ఇది ఓ టాస్క్‌ అని  ఒక య‌జ్ఞం వంటిదని  ప‌ట్టు పట్టి ప‌ని చేయాలని  కేసీఆర్ స్ప‌ష్టం అన్నారు. న‌ర్సింహులు రాజ‌కీయాల కోసం టీఆర్ఎస్ పార్టీలో చేర‌లేదని  మోత్కుప‌ల్లికి క‌రోనా వ‌చ్చిన‌ప్పుడు కోటి ఖ‌ర్చు అయినా ఫర్వాలేదని  ఆయ‌న‌కు మంచి వైద్యం అందించాల‌ని చెప్పానని అన్నారు. తామిద్దరం  మంచి స్నేహితులమని. మోత్కుప‌ల్లితో తన స్నేహం రాజ‌కీయాల‌కు అతీతమని  ద‌ళిత‌బంధు భేటీల‌కు మోత్కుప‌ల్లి హాజ‌ర‌య్యారని . ద‌ళిత బంధు ప‌థ‌కానికి తోడ‌వుతాన‌ని మోత్కుప‌ల్లి త‌న‌తో చెప్పారని గుర్తు చేసారు. 

 కట్నం అడిగితే దవడ పగల కొట్టండి

  కళ్యాణ లక్ష్మి పథకం పై కూడ కెసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం తో ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందిస్తుంటే  పేదింటి అమ్మాయిలను పెళ్లి చేసుకునే వాళ్ళు కెసిఆరే లక్ష ఇస్తున్నడని మీరెంత  ఇస్తారని  అడుగుతున్నారని ఈ విషయం తన దృష్టికి వచ్చిందని అలా అడుగుతున్న వాళ్ళ దవడ పగలకొట్టాలని  కెసిఆర్ అన్నారు.  పేదలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల అప్పుల పాలు అవ్వడం ఇబ్బందులు రావడం ఉండకూడదనే ఈ పథకాన్ని తీసుకు వచ్చానని అన్నారు. మళ్లీ ఇలా అడగడం ఏంటి అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. అందుకే కట్నం అడిగితే దవడ పగల కొట్టాలన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు