ప్రజాగ్రహ ముఖ్యమంత్రుల జాబితాలో అగ్ర స్థానం లో నిలిచిన కెసిఆర్

పడిపోయిన కెసిఆర్ పొలిటికల్ గ్రాఫ్

ఐఏఎన్‌ఎస్‌-సీ ఓటరు సర్వేలో వెల్లడైన ఆంశాలు




 ప్రజాకర్షణ అనేది రాజకీయనేతలకు కాలాన్ని బట్టి మారుతుంది. నెత్తి నెత్తుకుని ఊరేగిన జనం ఎప్పుడో  ఓ సారి కింద పడేస్తారు. ఎప్పుడూ ఒకే విదంగా జనం నేతలను ఆదరించడం అసంభవం. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విషయంలో అదే జరిగిందని సర్వేలు తేల్చాయి. ఐఏఎన్‌ఎస్‌-సీ ఓటరు సర్వేలో కెసిఆర్ గ్రాఫ్ పడిపోయినట్లు తేలింది. దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో కెల్లా కెసిఆర్ కు ప్రజాగ్రహ ముఖ్యమంత్రిగా చివరి స్థానం దక్కింది.  ప్రజాగ్రహ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 30.30  శాతం మంది ఓట్లు వచ్చినట్లు ఐఏఎన్‌ఎస్‌-సీ ఓటర్‌

| సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఛత్తీస్‌గఢ్‌ సీఎం

భూపేశ్‌ భాఘెల్‌ నిలిచారు. 94 శాతం మంది ఆయన పాలన పట్ల తృప్తిని వ్యక్తపరిచారని సర్వేలో స్పష్టం అయింది. మొత్తం 115 అంశాల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐఏఎన్‌ఎస్‌-సీ ఓటర్‌   సర్వే  నిర్వహించింది.  అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఛత్తీస్‌గఢ్‌ సీఎం

భూపేశ్‌ భాఘెల్‌ నిలవగా కేవలం ఆరు శాతం మంది మాత్రమే భాఘెల్‌ ప్రభుత్వంపై

వ్యతిరేకత వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పట్ల 44.7 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేయగా... భాఘెల్‌ సర్కారు తీరుపై 36.6 శాతం మంది అసంతప్తి వ్యక్తం చేశారు. సర్వేలో రెండో బెస్ట్‌ సీఎంగా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ దామి నిలిచారు భాఘెల్‌తో పోలిస్తే అతితక్కువగా ప్రజాగ్రహం ఉన్న సీఎంగా ప్రకాశ్‌ సింగ్‌కు చోటు దక్కింది. ప్రజాగ్రహం జాబితాలో మూడో స్థానంలో ఒడిసా సిఎం నవీన్ పట్నాయక్, నాలుగో స్థానంలో ఢిల్లీ సిఎఁ కేజ్రి వాల్ ఉన్నారు. మన పొరుగు రాష్ర్టం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడ నాలుగో స్థానంలో నిలిచారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి పై 28.1 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. 

 తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాపులారిటి తగ్గి పోవడం కారణంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యేందుకు దోహద పడోతోందని సివోటర్ సర్వే వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ ముఖ్ ఈ సందర్భంగా  విశ్లేషించారు.

సర్వే రిపోర్టును బట్టి తెలంగాణలో సిఎం కెసిఆర్ కు ఆయన పార్టీకి ఇక ముందు ముందు గడ్డు రోజులే ఎదురు కావచ్చు. కెసిఆర్ ప్రజాస్వామ్య స్పూర్తికి వురుద్దంగా  ఏకపక్ష నిర్ణయాలతో తన ఇష్టారీతిలో వ్యవహరించడం వల్ల ఆయనకు పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు