ఈ సారి ముందస్తు ఆలోచన లేదు - సిఎం కెసిఆర్


గతంలో లాగే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళతారని హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం చూసి నిర్ణయం తీసుకుంటారని వచ్చిన రాజకీయ విశ్లేషణలపై సిఎం కెసిఆర్ క్లారిటి ఇచ్చారు. 

తెలంగాణ భవన్ లో ఆదివారం జరిగిన శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ లో కెసిఆర్ పలు కీలక అంశాలపై పార్టి నేతలకు తన ప్రసంగంలో  అవగాహన కల్పించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని కెసిఆర్ అన్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉందన్నారు. రేండేళ్ల కాలంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడ  తెరాసదే ఘన విజయమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ సత్తాచాటి జాతీయ రాజకీయాల్లో  కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పార్టీని గ్రామ స్థాయి నుండి పటిష్ట పర్చాలని పార్టి నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా నవంబర్ 15 న వరంగల్ లో ప్రజాగర్జన సభ నిర్వహించాలని సమావేశంలో  నిర్ణయం తీసుకున్నారు. రోజూ 20 నియోజక వర్గాలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు.  ఈ సభతో టిఆర్ఎస్ పై  విమర్శలు చేసే ప్రతిపక్షాల నోళ్లకు మూతపడాలన్నారు. గర్జన సభ ఇన్‌చార్జిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని నియమించారు. వరంగల్ విజయ గర్జన సభకు ప్రతి ఊరు నుంచి బస్సు రావాలని ఆదేశించారు. సమావేశంలో  హుజురాబాద్ ఉప ఎన్నికలపై చర్చించారు. ఎన్నికల్లో గెలుపు టిఆర్ఎస్ దేనని తేలిపోయిందన్నారు.  ఈ నెల 25 అనంతరం కెసిఆర్ హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమావేశంలో నిర్ణయించారు.

25 న పార్టి ప్లీనరి

టిఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ మైంది.  అక్టోబర్  22 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది.  23 న స్క్రూటినీ ఉంటుంది. 24 న నామినేషన్ల ఉపసంహరణ.  ఈనెల  25 న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ జరుగుతుంది సభలో అదే రోజు  టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది.

టిఆర్ఎస్ పార్టీ  అధ్యక్ష  ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి   వ్యవహరిస్తారు. పర్యవేక్షణ అధికారిగా పర్యదా కృష్ణమూర్తి వ్యవహరిస్తారు.

 జిల్లా అధ్యక్షుల ఎన్నిక  తర్వాతే టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు