పాముకాటుతో భార్యను చంపించిన భర్తకు డబుల్ జీవిత ఖైదు

  కేరళ ఉత్రా  కేసులో కోర్టు సంచలన తీర్పు


భార్యను హత్యచేసి ఆస్తి కాజేసేందుకు కేరళలో ఓ వ్యక్తి కొత్త పద్దతి ఎంచుకున్నాడు.  ఎవరికి అనుమానం కలగకుండా ప్రమాదవశాత్తు మరణించిందని నమ్మించేందుకు పాముతో కాటు వేయించి చంపించాడు. అయితే కథ అడ్డం తిరిగి పోలీసుల విచారణలో కుట్ర కోణం బయట పడడంతో కేసు నమోదైంది. ఈ కేసులో 

పాముతో కాటు వేయించి భార్య చావుకి కారణమైన భర్తకు కేరళలోని కొల్లం కోర్టు డబుల్‌ జీవిత ఖైదు విధించింది. 

కేరళలో గతేడాది ఈ కేసు సంచలనం కలిగించింది.  ఉత్రా అనే వివాహిత హత్య కేసులో దోషిగా తేలిన ఆమె భర్త సూరజ్‌కు కొల్లాం అడిషనల్ సెషన్స్ కోర్టు రెండు జీవిత ఖైదులు విధిస్తూ బుధవారం నాడు తీర్పు వెలువరించింది. ఈ శిక్షతో పాటు పాముతో కరిపించి హత్య చేసినందుకు మరో పదేళ్లు, సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించినందుకు మరో ఏడేళ్లు కఠిన కారాగార శిక్షను విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

శిక్షతో పాటు సూరజ్‌కు రూ.5 లక్షల జరిమానా విధించింది. కోర్టు తీర్పు వెలువరించడంతో ఉదయం 11.40కి కొల్లాం జిల్లా జైలుకు సూరజ్‌ను తరలించారు.

సూరజ్ ఎస్‌ కుమార్, ఉత్రా 2018 లో వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వివాహ సమయంలో దాదాపు బంగారం, రూ.4 లక్షలు, ఒక కారును కట్నంగా ఇచ్చారు. ఉత్రా తండ్రి ప్రతి నెలా రూ .8,000 ఇచ్చేవారు. అయినా సూరజ్ అదనపు కట్నం కోసం ఉత్రాని వేధించేవాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయడానికి పథకం వేశాడు. తన మీదకి ఎటువంటి అనుమానం రాకుండా పామును ఉపయోగించి చంపాలని నిర్ణయించుకున్నాడు.


మే 7, 2020 న భార్యకి మత్తు పదార్థాలు ఇచ్చి ఆమెపై నాగుపామును వదిలాడు. అయితే పాము కాటుకు గురైనట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. దాదాపు 52 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంది. అయితే ఎలాగైనా అంతమొందించాలని సూరజ్‌ ఆస్పత్రిలో నిద్రిస్తుండగా మరో పాముని ఆమెపై వదిలాడు. ప్రాసిక్యూషన్ ప్రకారం.. ఆ మహిళ మొదటి పాము కాటు నుంచి బయటపడింది కానీ రెండో సారి పాము కాటువల్ల మరణించిందని తేల్చారు.

సూరజ్ ఎస్‌ కుమార్, ఉత్రా 2018 లో వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వివాహ సమయంలో దాదాపు బంగారం, రూ.4 లక్షలు, ఒక కారును కట్నంగా ఇచ్చారు. ఉత్రా తండ్రి ప్రతి నెలా రూ .8,000 ఇచ్చేవారు. అయినా సూరజ్ అదనపు కట్నం కోసం ఉత్రాని వేధించేవాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయడానికి పథకం వేశాడు. తన మీదకి ఎటువంటి అనుమానం రాకుండా పామును ఉపయోగించి చంపాలని నిర్ణయించుకున్నాడు.


మే 7, 2020 న భార్యకి మత్తు పదార్థాలు ఇచ్చి ఆమెపై నాగుపామును వదిలాడు. పాము కాటుకు గురైనట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దాదాపు 52 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్సలో ఉండగా ఆమెను ఎలాగైనా అంతమొందించాలని సూరజ్‌ ఆస్పత్రిలో నిద్రిస్తుండగా మరో సారి కుట్ర చేసి ఆమె గదిలోకి  పాముని  వదిలాడు. దాంతో రెండో సారి పాము కాటుకు గురైన ఉత్రా ఆసుపత్రిలోనే  మరణించింది.

ఈ కేసు పై కేరళలో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఉత్రా కేసులో హంతకుడుకి శీక్ష పడాలని వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరిపారు. 

కేసు తీర్పు పై కూడ అంతటా ఆసక్తితో ఎదురు చూశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు