కొండా పోస్టర్లు రిలీజ్ చేసిన వర్మ

 గాాంధి లెక్క రెండో చెంప చూపెట్టను...


తెలంగాణ రాజకీయాల్లో రాయలసీమ టైపు  ఫాక్షనిస్టు నేత వరంగల్ జిల్లాలో కొంత కాలం పాటు రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపించిన నేత  కొండా మురళి నేపద్య జీవితం ఆధారంగా ప్రముఖ దర్శక నిర్మాత  రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న కొండా   బయోపిక్ పోస్టర్లను సోమవారం విడుదల చేసారు. 

 గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. చంపేస్తా.. అర్ధం కాలే? అంటూ సీరియస్ గా చూస్తున్న కొండా మురళి చూపులతో ఉన్న పోస్టర్ తో పాటు మరో పోస్టర్‌లో చేతిలో టీ గ్లాస్ పట్టుకుని ఉన్న లుక్‌తో కొండా మురళి కేరక్టర్ పోస్టర్ విడుదల చేశారు. 

చేతిలో తుపాకీ.. చుట్టూ నక్సల్స్.. ఇది మరో యాంగిల్‌. నాలుగైదు పోస్టర్స్‌లో అనేక యాంగిల్స్‌లో కొండా కేరక్టరైజేషన్‌ను చూపించారు వర్మ. ఇంకో పోస్టర్‌లో నుదుటికి ఎర్ర తువాలు కట్టుకుని.. చేతిలో తుపాకి పట్టుకుని తీక్షణమైన లుక్‌తో కనిపిస్తున్నాడు. మరో పోస్టర్‌లో బాటిల్‌తో తలపై నీళ్లు పోసుకుంటూ సీరియస్‌ లుక్‌లో ఉన్నాడు. షర్ట్‌లో నుంచి కత్తి తీస్తోన్న పోస్టర్ మరొకటి. ఇలా, పోస్టర్స్‌తోనే కొండా మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చెప్పకనే చెప్పారు వర్మ. ఇక, కొండా సురేఖను ఒక పోస్టర్‌లో అందంగా.. మరో పోస్టర్‌లో విషాద వదనంలో చూపించారు. కొండా మురళి దంపలది 1980 లవ్ స్టోరి.  వీరి లవ్ స్టోరీ మావోయిస్టు ఆగ్ర నేత ఒకప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో ప్రధానంగా వరంగల్ లో ప్రజా ప్రతినిధులకు నిద్రపట్టకుండా చేసిన పోలం సుదర్శన్ రెడ్డి ఏలియాస్ రామకృష్ణ అందరూ షాట్ కట్ లో పిలుచుకునే ఆర్ కె సెంట్రిక్ గా కొనసాగింది. ఆర్ కె వీరి వివాహం జరిపించినట్లు కథ ప్రచారంలో ఉంది.

కొండా మరళి ఆర్ కె లది ప్రత్యేకమైన అనుభందం. ఆర్ కెది అన్నల రాజ్యం అయితే కొండా మురళిది ఫాక్షనిస్టు రాజ్యం. సినిమా టిక్ అంశాల విషయానికి వస్తే కొండా దంపతుల జీవితంలో అనేకం ఉన్నాయి. తెలంగాణాలో కొండాను బెజవాడ రంగాతో పోలుస్తారు. 

అగ్రసివ్ గా రాజకీయాల్లో తక్కువ సమయంలో  ఎదిగాడు. మావోయిస్టు అధినేత ఆర్ కె తో సంభందాలు ఉన్నాయన్న కారణంతో కొండా దంపతులతో ఎవరూ ఢీ కొనే వారు కాదు.  గ్రూపులు, గొడవలు, ప్రతీకారం, కక్షలు  వంటివి సినిమాకు అవసరం అయ్యే మసాలా  సరుకు చాలానే ఉంది. బహుశా వర్మకు కొండ దంపతుల లవ్ స్టోరితో పాటు అవన్నినచ్చి ఉండవచ్చు. దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వీరికి రాజకీయంగా లైఫ్ ఇచ్చాడు. అయన లేకుంటే కొండా జీవితం అర్దాంతరంగా మిగిలి పోయేది.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నక్సలైట్ల కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో  వీరిపై పోటా కేసు నమోదు అయింది. 

తెలుగు యువత అధ్యక్షులు కొల్లి ప్రతాప్ రెడ్డి హత్యకేసులో కొండా మురళి ప్రధాన నిందితుడు.  పలు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కు పోవడం వల్ల కొండా మురళి రెండు దశాబ్దాల పాటు రాజకీయ పదవులకు అర్హత పొంద లేక పోయారు. ఆయన భార్య సురేఖ తెర మీద అనేక పదవుల్లో కొనసాగి వై.ఎస్ హయాంలో 2009 లో మంత్రి అయ్యారు.  కొండా మురళి జిల్లా సహకార బ్యాంకు అద్యక్షులుగా పనిచేసారు.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైఎస్ మరణాంతరం కొండా సురేఖ వై.ఎస్ జగన్ కోసం మంత్రి పదవిని త్యజించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో వై.ఎస్ జగన్ ఓదార్పు యాత్ర పేరిట మహబూబాబాద్ వచ్చినపుడు తెలంగాణ వాదులు కొండా మురళి దంపతులతో పాటు ఇతర కాంగ్రేస్ నేతలపై రాళ్లు రువ్విన ఘటన తెలంగాణ ఉద్యమంలో ఓ మరిచి పోలేని ఘటన. ఈ రాళ్ల దాడి నుండి  కాపాడుకునేందుకు కాంగ్రేస్ నేతలు తెలంగాణ వాదులపై కాల్పులు జరపగా అనేక మంది గాయపడ్డారు.  విచిత్రం ఏంటంటే తెలంగాణ కు వ్యతిరేకంగా పనిచేసిన  కొండా మురళి దంపతుల ను తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కెసిఆర్ టిఆర్ఎస్ లో  చేర్చుకున్నారు. కెసిఆర్ ను కొండా సురేఖ తిట్టి పోసినట్లు ఎవరూ ఇంత వరకు తిట్టి పోయ లేదు.  అయినా కెసిఆర్ వారిని ఆదరించినప్పటికి ఎంతో కాలం పార్టీలో ఉండ లేక పోయారు. కెసిఆర్ వి ఒంటెద్దు పోకడలంటూ విమర్శ చేసి తిరిగి కాంగ్రేస్ పార్టీలో చేరారు.

కొండా సినిమా కోసం రాం గోపాల్ వర్మ కొండా దంపతులను కూడ సంప్రదించారు.  ప్రత్యేకంగా వర్మ వరంగల్ లో పర్యటించి  కొండా దంపతులు చదువుకున్న ఎల్ బి కాలేజీ ఇతర పరిసరాలు కూడ చూసి వెళ్లారు. వర్మ తీయబోయే కొండా సినిమా కథాంశంలో ఆసక్తి కర అంశాలు ఏముంటాయనే విషయంలో  చర్చ  అయితే బాగానే కొనసాగుతోంది.  ఈ సినిమా కొండా మురళి కి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది చూడాలి.

మావోయిస్టు నేత ఆర్ కె తో సహవాసం నెరిపిన ప్పటికి మురళిది పీడిత ప్రజా పోరాట నేపద్యం కాదు. పేదల పక్షాన నిలిచి ప్రజా పోరాటాలు నడిపిన చరిత్ర లేదు. ఆయన గత మంతా వ్యక్తి గత రాజకీయ ఎదుగుదల కోసం జరిగిన స్వార్ద సంగ్రామం అనే విమర్శలు ఉన్నాయి.

కొండా మురళి వంటి ఫాక్షనిస్టు తో సంభందాలు పెట్టుకున్నందుకు మావోయిస్టు నేత ఆర్ కెకు మావోయిస్టు(అప్పటి పీపుల్స్ వారు) ఉద్యమానికి చాలా నష్టం జరిగిందనేది నిర్వివాదాంశం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు