వైట్ ఛాలెంజ్ కు కెటిఆర్ లీగల్ ఛాలెంజ్

 రేవంత్ రెడ్డి వైట్  ఛాలెంజ్ కు బదులుగా కెటిఆర్ లీగల్ ఛాలెంజ్


టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కు బదులుగా మంత్రి కెటిఆర్ లీగల్ ఛాలెంజ్ చేశాడు. వైట్‌ చాలెంజ్‌ పేరిట రేవంత్‌ రెడ్డి  కేటీఆర్‌, కొండా విశ్వేశ్వరరెడ్డిలు డ్రగ్స్‌ పరీక్షలు చేయించుకోవాలంటూ సవాలు విసిరారు. 

సోమవారం ఉదయం గన్ పార్క్ వద్ద గల అమర వీరుల స్మారక స్థూపం వద్దకు రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రేస్ పార్టి నేతలు చేరుకోగా  మాజి ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి కూడ హాజరయ్యారు. తాను ఛాలెంజ్ కు సిద్దమే నంటు విశ్వేశ్వర్ రెడ్డి సవాలును స్వీకరించారు. ఆయన మరో ఇద్దరికి వైట్ ఛాలెంజ్ విసిరారు. బిజెపి చీఫ్ బండి సంజయ్ తో పాటు బిఎస్పి చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లకు వైట్ ఛాలెంజ్ విసరగా బండి సంజయ్ స్పందించారు. విశ్వేశ్వర్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నానని అయితే తన పాద యాత్ర అక్టోబర్ 2 తో ముగుస్తుందని తదనంతరం ఎక్కడికైనా వచ్చేందుకు సిద్దమన్నారు. మంత్రి కెటిఆర్ మాత్రం రేవంత్ రెడ్డి సవాలుకు ధీటుగా లీగల్ చర్యకు ఉపక్రమించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని కెటిఆర్ స్వయంగా ట్వీట్ చేశారు. " నాపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేశాను. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాను. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేరస్థులకు తగిన శిక్ష పడాలి అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. " అయితే కిందటి రోజు తాను ఎాలాంటి పరీక్షకైనా సిద్దమంటూ ప్రకటించిన కెటిఆర్   రాహుల్‌ గాంధీ అందుకు సిద్దపడితే తాను సిద్దమనన్నారు.  తెల్లవారే వరకు సీన్ మారి పోయింది. రేవంత్ రెడ్డి లాగిన ఛాలెంజ్ లో ఇరుక్క పోకుండా రూట్ మార్చి కెటిఆర్ లీగల్ చర్యలకు సిద్దమయ్యారు.

డ్రగ్స్ వ్యాప్తి పై అవగాహన కల్పించేందుకు యువతలో విశ్వాసం నింపేందుకు  తాను వైట్ ఛాలెంజ్ విసిరానని రేవంత్ రెడ్డి తెలిపారు. కెటిఆర్ విషయాన్ని పక్కదోవ పట్టిచేందుకు  ప్రయత్నించాడని ఆరోపించారు. హైదరాబాద్ లో పబ్బులు డగ్ర్స్ కు అడ్డాగా మారాయన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు