వేడెక్కిన హుజురాబాద్ రాజకీయాలు

 


హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కు షెడ్యూల్‌ విడుదల కావడంతో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. టిఆర్ఎస్, బిజెపీలు పోటా పటీగా గత మూడు నెలలుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఉప ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఎన్నికల కమీషను ను కోరడంతో ఎన్నికలు వాయిదా వేశారు. అయితే మంగళవారం కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకయాలు వెడెక్కాడియ 

హుజురాబాద్‌లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ అహంకానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. సిఎం, మంత్రి హరీష్ రావు ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారని విమర్శించారు. రాత్రి పూట పోలీస్ జీపులతో బీజేపీ నేతలను భయపెడుతున్నారని, టీఆర్ఎస్ నీచపు పార్టీ అని, ఆ పార్టీ నేతలు నీచపు మనుషులని దుయ్యబట్టారు. చిల్లర చేష్టలు చేస్తే.. ప్రజలు సహించరన్నారు. ఆర్డీవో ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. అక్టోబర్ 2న హుజురాబాద్‌లో బండి సంజయ్ ర్యాలీ ఉంటుందని ఈటల రాజేందర్ చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు