తెలంగాణ బాట పట్టిన ఆంధ్ర నేతలు

 తెలంగాణ కు వస్తానంటూ జెసి డిక్లేర్


తెలంగాణ మీద పడి తెగ తిన మరిగిన ఆంధ్ర,సీమ నేతలు పాత రోజులు తల్చుకుని తెగ ఇదై పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తమ దుకాణాలు ఇక నడవవని మూసేసుకుని పెట్టా బేడా సర్దుకుని ఆంధ్రాకు వెళ్లిన వారంతా తెలంగాణ ను తల్చుకోని రోజులు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మీద పడి ఇక్కడి నేతలను బానిసలుగా మార్చుకుని  నిలువుగా అడ్డంగా  దోచుకుని పీల్చి పిప్పి చేసిన ఆంధ్ర, సీమ నేతలు పాత రుచులు మరిచి పోలేక మళ్లా  తెలంగాణ బాట పట్టారు. 

ప్రైవేట్ బస్సులతో దొంగ పర్మిట్లతో తెలంగాణ లో దోపిడి కొనసాగించిన జెసి దివాకర్ రెడ్డి ఇదే యావతో తిరిగి తెలంగాణ మీద పడేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టాడు . మొదలు పెట్టడం ఏమిటి ఏకంగా సిఎం కెసిఆర్ కలిసేందుకు శుక్రవారం అసెంబ్లీకి వచ్చాడు. ఆయన లేక పోడడంతో  ఆయన కుమారుడు మంత్రి కెటిఆర్ ను  కలిసాడు.  లోపల ఇద్దరి మద్య ఏంసంభాషణ జరిగిందో ఏమో కాని బయటికి వచ్చి దివాకర్ రెడ్డి తాను ఆంధ్రాను వదిలి  మళ్లి తెలంగాణాకు వస్తానంటూ మీడియాకు కబురు అందించాడు. తెలంగాణా వదులుకుని చాలా నష్ట పోయానన్నాడు. అంధ్రలో ఓటుకు నాలుగు వేలు పలుకు తోందంటూ కూడ వాపోయాడు.  తెలంగాణ లో పాలన భేష్ అంటూ మెచ్చుకున్నాడు. 

ఏం ప్లాన్ తో వచ్చాడో కాని దివాకర్ రెడ్డి కెసిఆర్ ను అయన కొడుకుని బుట్టలో వేసుకుని తెలంగాణలో తన బస్సుల దుక్నం తెరిచి రూట్లకు పర్మిట్లు తీసుకుని చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసిని పూర్తిగా మూసి వేయిస్తాడో ఏమో ననే భయాందోళనలు లేక పోలేదు.

జెసి కాంగ్రేస్ నేతలను కూడ కలిసారు. అయితే ఈ సందర్భంగా  ఎమ్మెల్సి జీవన్ రెడ్డి జెసిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెసి టిఆర్ఎస్ కు అనుకూలంగా ఎందుకు  మాట్లాడారని నిల దీసారు. భవిష్యత్ లో ఎప్పుడూ ఇట్లా మాట్లాడ వద్దంటు హితవు కూడ పలికారట.

తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదని జేసీ గతంలో కూడ కామెంట్ చేశాడు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఓడి పోతాడంటూ కూడ జోస్యం చెప్పాడు. అయితే ఆనాడు కాంగ్రేస్ నేత హన్మంతరావు జెసిపై వ్యాఖ్యలపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసారు. 

ఆంధ్ర నేతలకు తెలంగాణలో ఎట్లా పనులు చేయంచు కోవాలో బాగా తెల్సు. ఒక్క జెసి దివాకర్ రెడ్డే కాదు ఆంధ్ర నేతలు చాలా మందే కెసిఆర్ ను ఆయన కుమారుడు కెటిఆర్ ను పొగుడుతూ తమ పనులు తాము చక్కబెట్టుకుంటున్నారనే  విమర్శలు కూడ ఉన్నాయి. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఆంధ్ర నేతల వ్యాపారాలకు ఢోకా లేదు. కాంట్రాక్టులు వ్యాపారాలు అన్ని వారివే కదా. ఏ పనులు ఎప్పుడు ఎవరి చేత చేయించుకోవాలో వారితోనే చేయించుకుంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు