బండి సంజయ్ బర్త్ కంట్రోల్ బిల్లు

 రాష్ట్రంలో అధికారం లోకి వస్తే జనాభా నియంత్రణ బిల్లు తెస్తామన్న బండి సంజయ్


పాదయాత్రలో  ఉన్న భారతీయ జనతా పార్టి చీఫ్ బండి సంజయ్ జనాభా నియంత్రణ బిల్లుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ముస్లీంల ను ఉద్దేశించి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసిఉంటారని విశ్లేషకులు అంటున్నారు.. హిందువులు బర్త్ కంట్రోల్ పాటిస్తున్నా ముస్లీం లు పాటించడం లేదు. ముస్లీంల జనాబా పెరిగిపోతోందంటూ సంఘ్ పరివార్ చాలా కాలంగా విమర్శలు చేస్తోంది. బండి సంజయ్ జనాబా నింయంత్రణ విషయంలో  చేసిన సంచలన వ్యాఖ్యలపై రక రకాల విశ్లేషణలకు ఆస్కారం ఏర్పడింది. 

ఒక్కరు చాలు... ఇద్దరు పిల్లలు హద్దు.... ముగ్గురు అసలే వద్దు  అంటూ తాము రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన వెంటనే జనాభా నియంత్రణ బిల్లును తీసుకొస్తామని ప్రకటించి బండి సంజయ్ రాజకీయ వర్గాల్లో కల కలం రేపారు.  అంతే కాకుండా ముస్లిం రిజర్వేషన్ల గురుంచి కూడ విమర్శలు చేసారు. ముస్లీం రిజర్వేషన్ల వల్ల ఇతర వెనుక బడిన వర్గాలకు కూలాలకు అన్యాయం జరిగిందని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా పోతున్నాయన్నాయని ఆరోపించారు. దీంతో బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలా జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు