కోకాపేట భూముల స్కాం పై సిబిఐ కి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

 విచారణ జరిపించాలని డిమాండ్ 
వేల కోట్ల రూపాయల స్కాం జరిగిీందని ఆరోపణ
భందువర్గాలకు కట్టబెట్టారని ఫిర్యాదు


కోకాపేట భూముల స్కాం పై విచారణ జరిపించాలని కాంగ్రేస్ పార్టి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి సిబిఐ డైరెక్టర్ ను కల్సి ఈ మేరకు ఫిర్యాదు పత్రం అంద చేశారు.

కోకాపేట, ఖానామెట్ గ్రామాల ప్రభుత్వ భూములను టిఆర్ఎస్ నేతల భందువర్గాలకు అగ్గువ ధరలకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. భూమూలు ఆగ్గువకు పొందిన వారిలో మైహోం వాటి అనుభంద సంస్థలు అట్లాగే టిఆర్ఎస్ నేతల భందువులు ఉన్నారన్నారు. భూముల వేలంలో వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందన్నారు. భూముల స్కాంలో ప్రధానంగా మై హోం రామేశ్వర్రావుతో పాటుగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీనియర్ ఐఏఎస్లు జయేశ్ రంజన్, అర్వింద్ కుమారులు ఉన్నారని రేవంత్ అంటున్నారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రాజ్పుష్ప కంపెనీ పేరుతోనూ తక్కువకు భూములు కొనుగోలు చేశారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా రేవంత్ స్పష్టం చేశారు. రూ.3 వేల కోట్లు రావాల్సిన భూములను, రూ.2 వేల కోట్లకే పరిమితం చేశారని సీబీఐకి ఇచ్చిన లేఖలో వివరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు