చిలక మనదే కాని పలుకు మనది కాదు - రేవంత్ పై కెటిఆర్

 రేవంత్ రెడ్డి ఎవరి మనిషో అందరికి తెల్సు
చిలక మనదే కాని పలుకు మనది కాదు
చంద్రబాబు కాంగ్రేస్ పార్టీని ఫ్రాంచైజ్‌లాగా తీసుకున్నాడు


తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తన దైన రీతిలో  టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ఆ చిలుక మ‌న‌దే కాని  ప‌లుకు ప‌రాయిది అని కేటీఆర్ అన్నారు. శుక్రవారం 

 తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అడిగిన ప్రశ్నలకు స్పందిస్తు ఎక్కువ సమయం మాట్లాడారు. రేవంత్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పిచ్చి ప్రేలాప‌న‌లకు పాల్ప‌డితే ప్ర‌జ‌లు త‌న్నిత‌రిమేస్తే వ‌చ్చి మ‌ల్కాజ్‌గిరిలో ప‌డ్డాడన్నారు. ఆయ‌నేదో భార‌త‌దేశానికి ప్ర‌ధాని అయిన‌ట్టు ఫీల‌వుతున్నాడని విమర్శించాడు.

 ఎమ్మెల్సి  ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన డబ్బులు పంచుతూ మూటతో దొరికాడని   ఆయ‌నెవ‌రో ఆయ‌న స్థాయి ఏందో.. బ‌తుకు ఏందో అంద‌రికీ తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయ‌న ఎవ‌రి మ‌నిషో కూడా తెలుసని. ఆయ‌న‌ను మాట్లాడించేది ఎవ‌రో కూడ తెలుసని అంటూ   ఆ చిలుక మ‌న‌దే  కానీ ఇక్క‌డిది కాదు ఆ ప‌లుకు అని సెటైర్ వేశారు. ఈ విషయం తనకే కాదు అందరికి తెల్సని అన్నారు. చంద్ర‌బాబు కాంగ్రెస్ పార్టీని ఫ్రాంచైజ్‌లాగా తీసుకున్నాడుని  చంద్ర‌బాబు ఆడించే తొలుబొమ్మ‌లాట‌లో  రేవంత్ రెడ్డి ఓ తొలు బొమ్మ‌ అన్నారు.

మ‌ల్లారెడ్డి అడిగిన‌ట్టు రేవంత్ రెడ్డి  రాజీనామా చేస్తే మంచిదని  ఇదంతా లొల్లి ఉండదని  కేటీఆర్ అన్నారు. రేవంత్ అంతలా మాట్లాడుతుంటే.. తాము ఇంకెంత మాట్లాడాలన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. సామెత గుర్తుకు తెచ్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నాడు. కెసిఆర్ ను ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. 

కేంద్ర ప్రభుత్వ విధానాలపై కెటిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వరదలు వచ్చిన సమయంలో మిగతా రాష్ట్రాలకు నిధులు ఇచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మొండి చేయి చూపించిందన్నారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఫిట్ ఇండియా , సిట్ ఇండియా, స్కిల్ ఇండియా అయిపోయి.. బేచో ఇండియా అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు. మౌలాళిలో 21ఎకరాల రైల్వే భూములను అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో రూ.6లక్షల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని. అందులో మౌలాళి భూములు కూడా భాగమని చెప్పారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు