మల్లన్న అరెస్ట్ పై జర్నలిస్టుల నిరసన

 


క్యూన్యూస్ నిర్వాహకుడు సీనియర్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ఏలియాస్ చింత పండు నవీన్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల  జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. గతంలో రఘును అక్రమంగా కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసిన రాతిలో పోలీసులు మల్లన్న ను కూడ అరెస్ట్ చేసి మొదట ఆచూకి తెలియ నీయలేదు. కుటుంబ సబ్యులు ఆయన అభిమానులు అనుచరులు ఆందోళన వ్యక్తం చేయడంతో సికింద్రాబాద్ సిటి సివిల్ కోర్టులో హాజరు పరిచారు.

కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైళుకు తరలించారు. సర్కార్ పనితీరును ఎండ గడుతు ప్రజల సమస్యలు నివేదిస్తున్న తీన్మార్ మల్లన్న పై అనేక పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదు అయ్యాయి. ఓ జ్యోతిష్యుడు తనను బ్లాక్ మయిల్ చేశాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

మల్లన్న అరెస్టును తెలంగాణ జర్నలిస్టులు పలువురు ఖండించారు. ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిలోనే మల్లన్నను అరెస్ట్ చేసిందని విమర్శించారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మల్లన్న అరెస్ట్ పై మండిపడ్డారు.

మల్లన్న అరెస్ట్ పై ప్రజాసంఘాలు మాట్లాడాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం హత్య జరిగిందని ప్రజాస్వామ్యం పునరుద్దరణకు పౌర సమాజం ముందుకు రావాలని పాశం యాదగిరి అన్నారు.

కెసిఆర్ సర్కార్ కూలిపోయే దశలో ఉందన్నారు. అందుకే కెసిఆర్ కు భయం పట్టుకుందన్నారు. తెలంగాణ లో జర్నలిస్టులను మిల్ కే రహో నహీతో బచ్ కే రహో అనే రీతిలో కెసిఆర్ రాజ్యం చేస్తున్నాడని విమర్శించాడు. పోలీసులు సృష్టించిన అక్రమ కేసులో మల్లన్నను ఇరికించారని విమర్శించారు. మల్లన్నను  అరెస్టు చేసి పోలీసులు రాజ్యాగ హక్కులను కాలరాసారని విమర్శించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు