డెంగీకి నిలయంగా మని ప్లాంట్లు

నగరంలో ఎక్కువ శాతం డెంగీ కేసులకు ఇవే కారణ మట


హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ర్టంలో కరోనాకు తోడుగా డెంగీ విషజ్వరాలు రోజు రోజుకూ  ఆందోళనకరమైన స్థితిలో పెరిగి పోతున్నాయి. వివిద జిల్లాలలో కేసుల నమోదు సంఖ్య చాలా తక్కువగా ఉన్నా నగరంలో మాత్రం ఎక్కువ సంఖ్యలో నమోదు కావడం గమనార్హం.  హైదరాబాద్కార్పోరేషన్ లో సుమారు 600 వరకు డెంగీ కేసులు నమోదు అయ్యాయి.  రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో కూడ కేసులు ఎక్కువగానే నంమోదు అయ్యాయి. ఈ విషజ్వరాలు అన్ని మూసి పరివాహక ప్రాంతంలో మురికి వాడల్లో నమోదు కాకుండా సంపన్నుల ప్రాంతంగా పిలిచే బంజారాహిల్స్ లో ఎక్కువగా నమోదు అయ్యాయి. దాంతో  వైద్య శాఖ ఉన్నతాధికారులు  కారణాల కోసం ఆరా పరిశోదనలు చేయగా పూలమొక్కలు ఎక్కువ పెంచే ఇండ్లు అపార్ట్ మెంట్లు దోమలకు ఆనవాళంగా మారాయని తేలింది. ఎంతో ఇష్టంగా పెంచుకునే మని ప్లాంట్లలో ఎక్కువగా డెంగీ దోమలు గుడ్లు పెట్టి వృద్ది చెందుతున్నాయట. గాలి శుద్దికోసం పెంచుకునే మని ప్లాంట్ల ద్వారా డెంగీ దోమలు వ్యాప్తి చెందుతున్నాయని అధికారులు అంచనాకు వచ్చారు. మని ప్లాంట్లు మనుషులకు సంపదలు కలిగిస్తాయని చాలా మంది వీటిని పెంచుతుంటారు. నగరాల్లో ఇండ్ల పరిసరాలలో ఎక్కువగా మని ప్లాంట్ల మొక్కలు కనిపిస్తుంటాయి.  సంపద తెచ్చే మాట ఎలా ఉన్నా డెంగీ విష జ్వరాలు మాత్రం ఈ మని ప్లాంట్ల ద్వారా ప్రబలుతున్నాయి. పడేసిన కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ఇనుప సామాన్లు తదితర చెత్త చెదారం పేరుకు పోయి నీళ్లు నిల్వ ఉండే చోట వర్షాకాలంలో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. నగరంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా జ్వరాలు సోకిన వారు చేరుతున్నారు. ఇందులో కొందరికి మామూలుగా వైరల్ జ్వరాలు కాగా కొందరికి డెంగీ జ్వరాలు సోకుతున్నట్లు వైద్యుల తెలిపారు. జ్వరాలన్ని ఎక్కువగా దోమల కారణంగానే పెరిగిపోతున్నాయి. నీలోఫర్ ఆసుపత్రిలో ప్రతి రోజు కనీసం 20 నుండి 30 డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. గాంధి ఆసుపత్రిలో రెండు వారాల్లో 20 మంది చిన్నారులకు డెంగీ జ్వరాలు సోకి చికిత్స కొసం చేరారు. 

అట్లా గని పూల మొక్కలను మని ప్లాంట్లను ఇప్పటికిప్పుడే పీకి పడేయకుండా పరిశరాలను పరిశుభ్రంగా ఉంటు కోవాలని సూచిస్తున్నారు. 

మని ప్లాంట్లు కాని లేదా ఇతర పూల మొక్కలు పెరుగుతున్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ తరుచూ వాటిపై వేప నూనె వంటి చీడ పీడల నివారణ  ద్రావణాలు స్ప్రే చేస్తూ ఉంటే దోమల లార్వాను అరికట్టవచ్చని  నిపుణులు సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు