కొత్త శివమూర్తి ఇక లేరు


బ్రాహ్మణిజం జన్మరహస్యం, దశావతారాల గుట్టురట్టు తదితర పలు చారిత్రక గ్రంధాలు రాసి బ్రాహ్మణిజం గుట్టును బట్టబయలుచేసి మూల్నివాసి బహుజన సమాజం చరిత్రను వెలికి తీసిన శూద్ర చరిత్రకారుడు కొత్త శివమూర్తిగారు ఈరోజు అనగా 26-08-2021 ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ లో అంతిమ శ్వాస విడిచారు.


 ఆయన తన జీవితమంతా బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థపై తన ఆచరణ, రచనల ద్వారా రాజీలేని తిరుగుబాటు చేశారు. తన పోరాటానికి అనుగుణంగానే తన జీవితాన్ని మలుచుకుని, ఆ లక్ష్యం కోసం అవే విలువలను తన చివరి క్షణం వరకు కొనసాగించిన ధన్యజీవి. 


ఆయన అనుసరించిన మార్గం చాలా స్ఫూర్తిదాయకం.  ఐతే ఆయన రచనలకు నిజానికి రావలసినంత ప్రచారం, గుర్తింపు రాలేదు. 

కాని అవి ఇప్పటికే బహుజన సమాజంలో కావలసిన అగ్గిని రాజేశాయి, ఎవరు కాదన్నా, ఔనన్నా అవే భవిష్యత్త్ విప్లవ విష్పోటనానికి ప్రాతిపదికలు కానున్నాయి. 

రాజమండ్రి స్మశాన వాటికలో  అంతిమ వీడ్కోలు

కొత్త శివమూర్తిగారి అంత్యక్రియలకు సంబంధించిన అంతిమయాత్ర  27-08-2021 (శుక్రవారం) మధ్యాహ్నం 1 గంటలకు రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ నుండి ప్రారంభమై గోదావరి నది పక్కన గల రాజమండ్రి శ్మశానవాటిక వరకు సాగుతుందని శివమూర్తి మిత్రులు తెలిపారు.

అంతిమ యాత్రలో పాల్గొనాలనుకునే బంధుమిత్రులు, అభిమానులు రేపు ఒంటి గంటవరకు రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకోవాలసి ఉంటుందని తెలిపారు.   


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు