తీన్మార్ మల్లన్నపై ఆగని వేధింపు కేసులు

కెసిఆర్ పై దుష్ప్రచారం చేస్తున్నాడని క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు
కార్యాలయం నుండి 40 హార్డ్ డిస్కులు డాక్యుమెట్లు స్వాదీనం


ముఖ్య మంత్రి పనితీరుపై విమర్శలు గుప్పిస్తు వార్తలు ప్రసారం చేస్తున్న జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. అనేక అక్రమ కేసులు మోదు చేసిన తెలంగాణ సర్కార్ తాజాగా  తీన్మార్మల్లన్న ఇంటిపైనా క్యూన్యూస్ కార్యాలయం ఛానెల్  పైనా ఏక కాలంలో సైబర్ క్రైమ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి సోదాలు నిర్వహించారు.  తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్‌పై యూట్యూబ్ చానల్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని  టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి మన్నె క్రిషాంక్  ఫిర్యాదు చేయగా  ఈ దాడులు చేశారు.  ఈ సందర్భంగా కార్యాలయం నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు కంప్యూటర్లు, 40 హార్డ్ డిస్కులతోపాటు పలు ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే, ఆయన కార్యాలయ ఆవరణలో ఉన్న ఇద్దరు విలేకరులను అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలకు మీసాలు తగిలించి అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేశారని మరో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ను అవమాన పరిచే రీతిలో వార్తలు ప్రసారం చేశారని ఆయన పలుకుబడికి భంగం కలిగించే రీతిలో వ్యవహిరంచారని  ఓయూ విద్యార్థి రామారావుగౌడ్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఆగస్ట్ 29 నుండి మల్లన్న మహా పాద యాత్ర ప్రారంభం కానుంది. ఆలంపూర్ నుండి ఆయన పాద యాత్రకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. పాదయాత్రను విఫలం చేసేందుకే మల్లన్నపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు పూనుకుందని విమర్శలు వచ్చాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు