వైఎస్ఆర్ తెలంగాణ పార్టి ఆవిర్భావం

 


తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టి ఆవిర్భవించింది. దివంగత మాజి ముఖ్యమంత్రి  వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వై.ఎస్ షర్మిల గత కద్ది రోజులుగా తెలంగాణలో మకాం వేసి పార్టి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేశారు.  గురువారం హైదరాబాద్ లో ఆమె తన పార్టి పేరు ను ప్రకటించారు. ఇడుపుల పాయలో తన తండ్రి 72 వ జయంతి వేడపకలకు హాజరై ఆయన సమాధి దగ్గర పార్టి జెండాలు ఉంచి నివాళులు అర్పించిన షర్మిల హైదరాబాద్ కు చేరుకుని లోటస్ పాండ్ లో తన అనుచరులతో జరిగిన సమావేసంలో  పార్టీని ప్రకటించారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతు వైఎస్‌ సంక్షేమ పాలన తేవడమే వైఎస్సార్‌ తెలంగాణ పార్టి  లక్ష్యమని వైఎస్ షర్మిల అన్నారు. పార్టీలో మూడు ముఖ్యమైన విభాగాలుగా రూపొందించామని  సంక్షేమం,  స్వయం అభివృద్ధి, సమానత్వం అని తెలిపారు. వైఎస్ చేసిన సంక్షేమం బాట ఇప్పటికీ రోల్ మోడల్ గా ఉందని అభివర్ణించారు. ఉచిత విద్యుత్, పావల వడ్డీ రుణ, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని తపించిన దార్శికుడు వైఎస్సార్ అని కొనియాడారు. 

తన ప్రసంగంలో తెలంగాణ సిఎం కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.

కృష్ణ జలాల జల వివాదం విషయంలో ఎపి సిఎం తన సోదరున్ని కూడ తప్పు పట్టారు. అదే విదంగా తెలంగాణ సిఎం  వైఖరిని కూడ ఎండ గట్టారు. ఓ రెండు నిమిషాలు ఇద్దరు సిఎంలు కూర్చుని మాట్లాకోలేరా అని ప్రశ్నించారు. కృష్ణ, గోదావరి నదుల జలాల విషయంలో ఒక్క నీటి చుక్క వృధా కానీయ వద్దనేది తమ పార్టి విధాన మన్నారు. తెలంగాణ కు దక్కాల్సిన వాటా దక్కాల్సిందే నని అన్నారు. అట్లాగే ఇతర రాష్ట్రాలకు చెందాల్సిన నీటి విషయంలో అభ్యంతరాలు ఉండ బోవన్నారు. 

పార్టి ఆవర్భావ సభలో ప్రసంగించిన విజయమ్మ


అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. షర్మిలను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అంతకు తగ్గకుండా ప్రజలకు ఇచ్చారని అన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సంక్షేమం అభివృద్ధికి పెద్దపీఠ వేశారని వివరించారు. వైఎస్ లేరని తెలిసి పరితపించిన గుండెలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయని విజయమ్మ తెలిపారు. వైఎస్ కోసం చనిపోయిన వారు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నారని విజయం వివరించారు.

ఆడబిడ్డ రాజకీయాల్లోకి వచ్చిందని చులకనగా చూడనక్కరలేదని సింహం లాంటి నేతకు జండర్ అడ్డురాదని విజయమ్మ అన్నారు. షర్మిలను వైఎస్ఆర్ ప్రిన్సెస్ పెంచారని తండ్రి ఆశయ సాధనకోసమే షర్మిల ఈ రోజు పార్టీ ప్రారంభిస్తున్నారని ఆమె వివరించారు. రాజన్న రాజ్యం తెలంగాణ జన్మహక్కని షర్మిల నమ్ముతుందని అందుకే ఇక్కడ కొత్త పార్టీ పెట్టిందని ఆమె వివరించారు.

బిడ్డలు దొంగలో గజ దొంగలో కాదు

వైఎస్ఆర్ బిడ్డలు దొంగలు...గజదొంగలు అసలే కాదని వైఎస్ విజయమ్మ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.వారు ఉన్నది పంచడానికే వారు కష్టపడతారని, మాట ఇస్తే...తప్పరని పేర్కోన్నారు. నీటి సమస్యలు ఉంటే...చట్టపరంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఇందుకోసం చాలా వ్యవస్థలు ఉన్నాయని అన్నారు. వాటిని ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలు బలంగా ఎదగాలని వైఎస్ విజయమ్మ ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు