ఎస్ బిఐ ఎటిఎం లో చిరిగిన నోట్ల కల కలం

ఎటిఎం లలో చిరిగిన నోట్లు వస్తే భాద్యులు ఎవరు ? బ్యాంకులు వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తే ఖాతాదారులు నష్ట పోవాల్సిందేనా ?
బ్యాంకుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఖాతాదారుల ఆరోపణ



ఎటింఎం లో చిరిగిన నోట్లు చెల్లుబాటుకు పనికి రాని నోట్లు వస్తే ఎవరు భాద్యులు ? ఈ విషయంలో రిజర్వు బ్యాంకాఫ్ ఇండియా నుండి స్పష్ట మైన ఆదేశాలున్నా బ్యాంకులు పట్టించు కోవడంలేదు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ లోని రాగన్న దర్వాజ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటిఎంలో వారం రోజుల పాటు చిరిగిన నోట్లు కల కలం రేపాయి. పలువురు ఖాతాదురులు ఈ ఎటిఎం నుండి నగదుడ్రా చేయగా చిరిగిపోగా పేపర్ ప్లాస్టర్ వేసి అతుకు పెట్టిన 500 రూపాయల నోట్లు వచ్చాయి. కలవరం చెందిన ఖాతాదురులు ఆనోట్లను తీసుకు వెళ్లి సంభందిత బ్యాంకు మేనేజర్లను కలిస్తే నోట్ల భాగాలు చిరిగి పోయి ఉన్నాయని తాము తీసుకోలేమని చెప్పారని ఖాతాదారులు వాపోయారు. ఎస్ బిఐ మెయిన్ బ్రాంచి కి వెళ్లమని సూచించారని అక్కడకు వెళితే మీ అక్కౌంట్ ఏ బ్రాంచిలో ఉందో అక్కడే తీసు కోవాలని రెండు మూడు రోజులు బ్యాంకుల చుట్టు తిప్పించారని ఆరోపించారు. ఎటిఎం లో అసలు చిరిగిన నోట్లు ఎలా వస్తాయంటూ ఎదురు ప్రశ్నలు వేశారని ఖాదాదారులు ఆరోపించారు. ఎవరో ఒక్కరికి చిరిగిన నోట్లు వచ్చాయంటే సరే ఖాతాదారులే అబద్దాలు చెప్పారని అనుకోవచ్చు కాని ఐదారుగురు ఖాతాదారులకు ఇదే సమస్య ఏర్పడింది. ఎటిఎం లో నగదు లోడ్ చేసే టపుడు క్షుణ్ణంగా కరెన్సి నోట్లను చెక్ చేసి లోడ్ చేయాల్సి ఉంటుంది. కాని చెక్ చేయకుండా బండిల్స్ లో  చిరిగిన నోట్లు ఉన్నా పట్టించు కోకుండా లోడ్ చేయడం వల్ల ఖాతాదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 

తాను రాగన్న దర్వాజ ఎటిఎం నుండి 10 వేలు డ్రా చేయగా 500 నోట్లలో ఐదు నోట్లు చిరిగి పోయినవి పేపర్ ప్లాస్టర్ అతికించినవి వచ్చాయని కె సునంద అనే  బ్యాంకు కస్టమర్  తెలిపారు. నోట్లను మార్చమని అడిగితే  మూడు రోజులు ఎస్ బిఐ బ్యాంకుల చుట్టూ తిప్పించు కున్నారని అన్నారు. మిగతా ఖాతాదురులను కూడ ఇలాగే బ్యాంకుల చుట్టూ తిప్పించుకున్నారని ఆరోపించారు.

ఎటిఎం లలో దొంగ నోట్లు లేదా చిరిగి పోయిన నోట్లు వస్తే అందుకు సంభందిత బ్యాంకులే భాద్యత వహించాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాలు కూడ ఉన్నాయి. అయితే ఇలా చెల్లని నోట్లు ఎటిఎం లలో వచ్చిన సందర్బాలలో  సంభందిత బ్యాంకుల అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటిఎం లలో డ్రా చేసిన అధారాలు ఫోటోలు చూపించినా బ్యాంకు అధికారులు పట్టించు కోవడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి.  ప్రభుత్వ రంగ  బ్యాంకులలో  పెద్ద బ్యాంకు అయిన ఎస్ బిఐ లో ఇలా ఉంటే ఇక ఇతర బ్యాంకులలో అయితే కనీసం ఇలాంటి సమస్యలు వచ్చి నపుడు నోట్లను మార్చడం అటుంచి భాద్యతగా జవాబు దారీగా కూ  వ్యవహరించడం లేదని  ఖాతాదారులు ఆరోపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు