గడ్డం గీయించుకోండంటూ ప్రధానికి 100 రూపాయలు పంపిన వ్యక్తి

ఎందుకో తెలుసా ?



 కరోనా మహమ్మారి పడగ సామాన్యుల బ్రతుకులను ఆగం చేసింది. పనిచేస్తే కాని తిండి దొరకని సామాన్యులు లాక్ డౌన్లతో జీవనం గడకవ పస్తులతో గడుపుతున్నారు.  ఏడాదిన్నరకు పైగా దినసరి కూలీలు పనులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిలో టీలమ్మిన చరిత్ర కలిగిన  దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ టీ కొట్టు నడిపే వ్యక్తి తాను దాచుకున్న డబ్బుల్లో 100 రూపాయలు పంపి వార్తల్లో నిలిచారు.   

మహారాష్ట్రలోని బారామతికి చెందిన మోరే అనే వ్యక్తి టీ కొట్టు నడుపుతుండే వాడు. కరోనా ఎఫెక్ట్ కారణంగా టీ దుకాణం నడవటం లేదు.  దేశంలో తన లాంటి వారి పరిస్థితి ఎట్లా ఉందో ప్రధాన మంత్రికి అర్దం అయ్యేలా చేయాలని ఓ లేఖ రాస్తు దానితో పాటు ఓ వంద రూపాయలు పంపించాడు.  ప్రధానమంత్రి అంటే తనకు ఎంతో గౌరవమని అభిమానమని తాను దాచుకున్న డబ్బుల నుండి 100 ూపాయలు పంపుతున్నానని  పెంచిన గడ్డం  గీయించుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ గడ్డం పెంచుతున్నారు. ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేది అయి ఉండాలి. దేశ జనాభాకు వీలైనంత వేగంగా టీకాలు వేయిండానికి, వైద్య సదుపాయాలను పెంచడానికి ఆయన ప్రయత్నాలు చేయాలి. చివరి రెండు లాక్‌డౌన్‌ల వల్ల కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపైనే ప్రధాని దృష్టి సారించాలని ఆ లేఖలో మోరే పేర్కొన్నాడు.

ఈ దేశ అత్యున్నత నాయకుడు. ఆయన్ని అవమానించడం, బాధపెట్టడం నా ఉద్దేశం కాదని స్పష్టంచేశారు. మహమ్మారి వల్ల రోజు రోజుకు ఈ దేశ పేదలు పడుతున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేయాలనుకుంటున్నా అని పేర్కొన్నారు. ఆయన దృష్టిని ఆకర్షించేందుకే ఈ మార్గం ఎంచుకున్నానని మోరే తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు