శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ


 తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా భాద్యతలు స్వీకరించిన అంతరం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించు కోవడం ఇదే మొదటి సారి.  చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కు ఆలయం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి  ఘన స్వాగతం పలికారు.   కుటుంబ సమేతంగా సిజేఐ అభిషేక సేవలో పాల్గొన్నారు.  రంగనాయకుల మండపంలో సీజేఐ ఎన్వీ రమణకు వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆయనను టీటీడీ అధికారులు మర్యాద పూర్వకంగా శేష వస్త్రంతో సత్కరించి  తీర్ధ ప్రసాదాలు అందించారు. 

అఖిలాండం వద్ద ఎన్వీ రమణ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బేడి ఆంజనేయస్వామిని జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చానన్నారు. న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. 

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. 

హైదరాబాద్ లో స్వాగతం పలికిన సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తి ఎన్వీ రమణ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకు క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన సీజేఐ ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు