గంగా నదిలో పెట్టలో లభించిన 21 రోజుల పసికందు

 పురాణాల్లో విన్నకథలు నిజంగా జరిగితే ఎట్లా ఉంటుంది కర్ణుడు గంగానదిలో ఓ పెట్టలో దొరికాడని బారతంలో చదివాం.  ఉత్తర ప్రదేశ్ లో అచ్చం అట్లాగే ఓ పసిపాప గంగా నదిలో ఓ  చెక్క పెట్టలో కొట్టుకు వచ్చింది.


ప్రవహించే గంగా నదిలో ఓ పెట్టెలో  పసి కందును పెట్టి ఎవరో వదిలి వేయగా అది ఓ పడవ నడుపుకునే వ్యక్తికి దొరికింది. యూపీలోని ఘాజిపూర్‌లో ద్రి ఘాట్ సమీపంలో జరిగింది.  చెక్కపెట్టలో 21 రోజుల పసికందు ను ఉంచి చుట్టూ కాశాయ వస్త్రాలు అమర్చి వివిద దేవతల ఫోటోలు ఉంచి గంగా నదిలో వదిలి పెట్టారు. చెక్క పెట్ట నదిలో తేలుతూ రావడం   పడవ నడిపే ఓ వ్యక్తి గమనించాడు. ఆ పెట్ట సమీపం లోకి వెళ్లగా పసిపాప ఏడ్పులు వినిపించాయి. దాంతో ఆతను దాన్ని తెరిచి చూడగా ఏడుస్తున్న పసిపాప కనిపిచించింది. కాగితంలో ఆ పసిపాప  జాతకం రాసి ఉన్నాయి. 21 రోజుల క్రితం ఆ పాప జన్మించినట్లు జాతక చక్ర వివరాలు ఉన్నాయి.  ఆ పాప జాతకం  రీత్యా జన్మనామం గంగా అని రాసి ఉంది. ఆశ్చర్య పోయిన ఆ వ్యక్తి  ఆ పసిపాపను తనకు గంగా మాతే ప్రసాదించిన వరమని సంతోషంతో ఇంటికి తీసుకు వెళ్లాడు. అయితే ఈ విషయం గ్రామంలో అందరికి తెల్సి పోయి ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. పోలీసులు వచ్చి పసిపాప వివరాలు సేకరించి ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రభుత్వ ఆశాజ్యోతి కేంద్రానికి తరలించారు.  పాపకు వైద్య పరీ్కషలు చేసి ఆరోగ్యంగా ఉందని నిర్దారించారు.

ఆసలు ఆ పసిపాపను ఎవరు పెట్టలో పెట్టి గంగా నదిలో వదిలారో ఎందుకు వదిలారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా వ్యక్తులు గంగా మాత అద్భుతంగా ప్రచారం చేసేందుకు ఇట్లా చేసారా పసిపాపకు గంగా గా నామకరణం చేసి దేవతా అవతారంగా చూపాలనుకున్నారా  అనే విషయాలపై చర్చ జరుగుతోంది.

 ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్య నాధ్ ఈ పసిపాప విషయం తెల్సుకుని ప్రభుత్వం స్వయంగా ఆ పాప అలనా పాలన చూస్తుందని ప్రకటించారు. పాప సంరక్షణ భాద్యతలు పూర్తిగా ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు. పాపను కాపాడిన పడవ నడిపే వ్యక్తి మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నాడు. తనకు గంగా మాత ప్రసాదించిన పసిపాపను ప్రభుత్వం తీసుకోవడం సరికాదని ఆవేదన చెందాడు. అయితే అతనికి ఆర్థిక సహాయం అంద చేయాలని ఇళ్లు కట్టివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారి చేశాడు. 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు