ఈటల పై మావోయిస్టుల ఘాటు లేఖ

 మాజీ మంత్రి  ఈటెల రాజేందర్ బీజెపీలో చేరిక పై మావోయిస్టులు  ఘాటు లేఖ విడుదల చేసారు
మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట  లేఖ 


ఈటల టిఆర్ఎస్ ను వీడే సందర్బం వచ్చినపుడు టిఆర్ఎస్ వ్యతిరేక వర్గాలన్ని అయనకు మద్దతు గా నిలిచాయి. అయితే ఆయన బీజెపీలో చేరిన తర్వాత బీజెపి వ్యతిరేక శక్తులు, వ్యక్తులు ఆయనను టార్గెట్ చేసాయి. ఈటల కాంగ్రేస్ పార్టీలో చేరితో ఎట్లా ఉండేదో స్వంతంగా పార్టి ఏర్పాటు చేస్తే ఎట్లా ఉండేదో కాని ప్రస్తుతం ఆయన బీజెపి లో చేరి ఆఖరికి మావోయిస్టులకు కూడ టార్గెట్ అయ్యాడు. రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి అంతగా లేక పోయినా అప్పుడప్పుడూ వారు విడుదల చేసే లేఖలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.  తాజాగా ఈటెల బీజెపి లో చేరిక విషయం లోకూడ మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. 
వ్యక్తులు ఎవరైనా ఏ పార్టీలో అయినా చేరే స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఈటెల పై మావోయిస్టులు లేఖ విడుదల చేయడం పట్ల ఈటల ఎట్లా స్పందిస్తారో చూడాలి.

జగన్ లేఖ 

ఈటల రాజేందర్ తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ కెసిఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి  పోరాడాలని ప్రకటన చేశారు... ఆ ప్రకటన చేసి  హిందూత్య పార్టీ అయినా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

 కేసీఆర్ కు ఈటెల రాజేందర్ కు  మధ్య జరుగుతున్న విషయం..ఇది తెలంగాణ   ప్రజలకు సంబంధించిన విషయం కాదు.. వారు ఒకే గూటి పక్షులు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కెసిఆర్ ,ఈటెల రాజేందర్ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారు...

వీరి పాలన ప్రజా వ్యతిరేకమైనది... సామ్రాజ్యవాద దళారి నిరంకుశ పెట్టుబడిదారీ విధానానికి భూస్వామ్య వర్గాల కు అనుకూలంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల పునర్నిర్మాణం మార్చారు...

మొన్నటి వరకు కెసిఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటెల తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించాడు.అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించాడు.

కెసిఆర్ బర్రెలు తినేవాడు అయితే ఈటెల రాజేందర్ గొర్రెలు తినే  ఆచరణ కొనసాగించాడు. తెలంగాణలో   ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాం అని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసం నేడు బిజెపిలో చేరారు...ఆర్ ఎస్ యు  మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం గామా పార్టీ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుంది. 

ఈటెల తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారు...

బిజెపి హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో విశాల ప్రజలు ఐక్యమై పోరాడుతున్నారు. అలాగే కెసిఆర్ నియంత పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారు.

‘తెలంగాణలో ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటం చేస్తానన్న ఈటల చివరికి తన ఆస్తులను రక్షించుకోడానికి బీజేపీలో చేరారు. మోదీ నాయకత్వంలో బీజేపీ-హిందూత్వ ఫాసిజం.. ఏకంగా దేశాన్నే అమ్మకానికి పెట్టింది. బీజేపీ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశప్రజలు, ఇటు కేసీఆర్ నియంతృత్వంపై తెలంగాణ జనం పోరాడుతున్న కీలక సమయంలో ఈటల బీజేపీలో చేరడం, హుజూరాబాద్ స్థానం నుంచి మళ్లీ పోటీని ఆత్మగౌరవ పోరాటంగా అభివర్ణించడం ముమ్మాటికీ మోసపూరితం. నిజానికి మొన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించడం ద్వారా ఈటల ఏనాడో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కేశారు. దళారీ నిరంకుశ పాలక పద్ధతుల్లో దూకుడు స్వభావం కలిగిన పార్టీ బీజేపీ. ప్రతిఘాతక పార్టీలో చేరడం ద్వారా ఆత్మగౌరవం సాధిస్తానని ఈటల చెప్పడం మోసం. ఈటల అవకాశవాదాన్ని, కేసీఆర్ నిరంకుశత్వాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలి'' అని మావోయిస్టు నేత జగన్ పేర్కొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు