భారతీయుడు అందులో తెలుగు బిడ్డ మైక్రో సాఫ్ట్ సిఇవో సత్య నాదెళ్లకు మరో అరుదైన గౌరవం దక్కింది. మైక్రో సాఫ్ట్ చైర్మన్ గా ఆయన బాద్యతలు చేపట్టాడు. బోర్డు ఛైర్మన్‌గా సత్య నాదేళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 2014 నుండి సత్య నాదెళ్ల మైక్రో సాఫ్ట్ సిఇవో గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఛైర్మన్ గా కొనసాగుతున్న జాన్ థామ్సన్‌ను స్వతంత్ర డైరెక్టర్ గా నియమించారు. 2014 లో మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిలి గేట్స్ చైర్మన్ పదవి నుండి తప్పుకున్న తర్వాత జాన్ థామ్సన్ ఆయన స్థానంలో చైర్మన్ గా కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం బిల్ గేట్స్ కు మైక్రో సాఫ్ట్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు. ఆయన పూర్తిగా ఈ వ్యవహారాల నుండి తప్పుకుని ఏడాది దాటింది.
'బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ పేరిట తన సతీమని మిలిండాతో పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా ఆయన పూర్తిగా ధార్మిక సేవల్లో మునిగి పోయాడు. అయితే ఈ మద్యకాలంలో బిలిగేట్స్ భార్యకు విడాకులు ఇస్తున్నాడన్న వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మరో యువతితో సంభందాలు పెట్టుకున్న బిలి గేట్స్ కు మిలిండాతో విడాకులు కోర్టు వరకు వెళ్లాయి. ఈ నేపద్యంలోనే బిలిగేట్స్ మైక్రో సాఫ్ట్ కు పూర్తిగాదూర మయ్యాడని మరో కథనం కూడ ఉంది.
సత్యనాదెళ్ల మైక్రో సాఫ్ట్ చైర్మన్ గా భాద్యతలు చేపట్టడం పట్ల భారతీయులు ఆనందం వ్యక్తం చేసారు. సత్య నాదేళ్ల స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా బుక్కా పురం గ్రామం. సత్యనాదేల్ళ విద్యాభ్యాసం పూర్తిగా హైదరాబాద్ లో సాగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ పూర్తి చేసి.. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం సాఫ్ట్‌వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. సత్యనాదెళ్ళ తండ్రి ఐఏఎస్ అధికారిగా పలు కీలకపదవుల్లో పనిచేసారు.ఆయన తండ్రి నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2004 నుంచి 2009 వరకు కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box