విరించి ఆస్పత్రికి కరోనా లైసెన్స్ రద్దు

 


నగరంలోని బంజారా హిలిస్ లో గల విరించి ఆసుపత్రి కరోనా లైసెన్సును  ప్రభుత్వం రద్దు చేసింది. ఆసుపత్రి లైసెన్సును రద్దు చేసినట్లు  ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు ఓ పత్రికా  ప్రకటన జారీ చేశారు. కోవిడ్ పేషెంట్ల నుంచి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా చికిత్స సరైన విధానం అనుసరించడం లేదని విరించి ఆస్పత్రిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నల్లగొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తికి కరోనా సోకడంతో అతని కుటుంబ సభ్యులు విరించి ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో కోలుకోక పోగా ఆరోగ్యం విషమంగా మారి  ప్రాణాలు కోల్పోయాడు. రూ. 20 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు అతని కుటుంబ సభ్యులకు  చెప్పడంతో ఆగ్రహించిన వంశీకృష్ణ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన జరిపారు. మృతుడి సోదరి స్వయానా డాక్టర్ కావడంతో ఆసుపత్రి వైద్యులను నిలదీసారు. చప్పుడు ట్రీట్ మెంట్ వల్ల తన సోదరుడు చనిపోయాడని ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపద్యంలో ఆసుత్రి వర్గాలకు వంశీకృష్ణ కుటుంబ సబ్యులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి శాంత పరిచే దేంకు ప్రయత్నం చేసారు. ఆసుత్రిపై దాడికి పాల్పడ్డారంటూ ఆసుపత్రి వర్గాలు పోలీసులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసులు నమోదు చేసారు. 

ఈ కేసుకు సంభందించిన 16 మందిని అరెస్టు చేసారు.  మెజిస్ట్రేట్ ఆదేసాలతో వారిని రిమాండ్ చేసారు.  మృతుడి కుటుంబ సబ్యులు కూడ ఆసుపత్రి యాజమాన్యంపై   ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సరైన చికిత్స అందించకుండా పెద్ద మొత్తంలో  డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో విరించి ఆస్పత్రికి రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై విరించి ఆస్పత్రి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కరోనా లైసెన్స్‌ను రద్దు చేశారు. దీనికి సంబంధించిన నోటీసులను కూడా ఆస్పత్రికి పంపించారు.

64 ఆసుపత్రులకు నోటీసులు జారి

తెలంగాణలో 1200 పైగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స కొనసాగుతోంది. బిల్లులు అధికంగా వేస్తున్నారని 64 ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు అందాయి. కూకట్‌పల్లిలో ఒకే ఆస్పత్రిపై 6 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులకు ఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా షోకాజ్‌కు సమాధానం ఇవ్వకపోతే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. గతంలో మూడు ఆస్పత్రులకు ఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో కొవిడ్ సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు