4 కోట్ల కోవాగ్జిన్ డోసులు మాయం ?

వాక్సిన్ డోసులు నల్ల బజారుకు తరలాయా ?


వాక్సిన్ల కోసం దేశంలో జనం బారులు తీరుతుంటే మరో వైపు వాక్సిన్ కొరత తీవ్ర సమస్యగా మారింది. పాలకుల మందు చూపు లోపించడంచో దేశంలో వాక్సిన్ చాలా పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికిప్పుడు ఈ సమస్య తీరే దారి లేదు. దేశంలో దశల వారీగా అందరికి టీకాలు పూీర్తి కావాలంటే మరో ఏడాది వరకు నీరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే మరో వైాపు  దేశంలో తయారైన వాక్్సిన్లు పక్క దారి పడుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి.

హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లలో 4 కోట్ల కొవాగ్జిన్ షాట్స్ గల్లంతు అయ్యాయి.  అయితే ఇంత పెద్ద మొత్తంలో  కోవాగ్జిన్ షాట్స్ ఎట్లా పక్క దారి పట్టాయనే విషయాన్ని కేంద్రం తేల్చాల్సి ఉంది. కేంద్రం వెల్లడించిన వివరాల మేరకే కోవాగ్జిన్ షాట్స్ మిస్సింగ్ వ్యవహారం బయట పడింది.

కేంద్రం పలు సందర్భాల్లో చేసిన ప్రకటనల ప్రకారం  లెక్కలు కడితే ఇప్పటివరకు 6 కోట్ల డోసుల కొవాగ్జిన్ దేశంలో అందుబాటులో ఉండాలి కాని దేశ వ్యాప్తంగా కేవలం 2.1 కోట్ల వాక్సిన్ మాత్రమే ఇచ్చారు. మిగతా   4 కోట్ల వాక్సిన్ ఏ మైనట్లో తేలాలి. 

ఇప్పడీ వార్త జీతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం జనవరి నుంచి ఇప్పటివరకు దేశంలో భారత్ బయోటెక్ 8 కోట్ల కోవాగ్జిన్ డోసులు (Covaxin vaccine doses) తయారు చేసినట్టు కంపెనీ ఇచ్చిన ప్రకటనలే స్పష్టంచేస్తున్నాయి. అందులో వ్యాక్సిన్ డిప్లొమసీలో భాగంగా 2 కోట్ల డోసులు విదేశాలకు ఎగుమతి అయినట్టుగా భావించినా.. మిగతా 6 కోట్ల డోసులలో 2 కోట్ల డోసులు పోగా మరో 4 కోట్ల డోసులు ఏమయ్యాయనేదే ప్రస్తుతం ఓ పజిల్‌గా మారింది. 

కొవాగ్జిన్ వ్యాక్సిన్ షాట్స్ వినియోగం ఢిల్లీలోనే అధికంగా కనిపించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఢిల్లీలోనే అత్యధికంగా 31 శాతం మంది కోవాగ్జిన్ డోసులు ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోనూ కొవాగ్జిన్ డోసులు అందుబాటులో లేకపోవడంతో పలు చోట్ల వ్యాక్సినేషన్ డ్రైవ్ (COVID-19 Vaccination in Delhi) నిలిచిపోయింది. 

ఇప్పటివరకు దేశంలోని మరో 14 చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక్క కొవాగ్జిన్ డోసు (Covaxin vaccine shots) కూడా అందలేదు. మరో ఐదు రాష్ట్రాల్లో ఇప్పటివరకు చేపట్టిన కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో కొవాగ్జిన్ వాటా కేవలం 5 శాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు సైతం కొవాగ్జిన్ డోసులు అందనప్పుడు ఆ మిగతా డోసులు అన్నీ ఏమయ్యాయనేదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కొవాగ్జిన్ డోసులను నల్లబజారుకు తరలించారా లే విదేశాలకు తరలించారా అనే విషయం తేలాల్సి ఉంది.

దేశంలో వాక్సిన్ అందక ప్రజలు ఓ వైపు గగ్గోలు పెడుతున్నారు. మరో వైపు వాక్సిన్ జనాభాకు తగిని రీతిలో వాక్సిన్ ఉత్పత్తి జరగడంలేదు. ప్రపంచంలో కరోనా తీవ్రంగా ఉండే దేశాలతో పోలిస్తే భారత్ వాక్సినేషన్ ప్రక్రియ లో చాలా వెనుక పడి పోయింది. కోవాగ్జిన్ 4 కోట్ల డోసులు ఏమయ్యాయో కేంద్రం నిగ్గు తేల్చాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు