దోషిగా నిలబెట్టేందుకు పెద్ద స్థాయిలో కుట్ర - మమత బెనర్జి

 


టీఎంసీ సర్కారును దోషిగా నిలబెట్టేందుకు పెద్ద స్థాయిలో కుట్ర జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి ఆరోపించారు. శుక్రవారం నాడు ప్రధాని బెంగాల్ పర్యటన సందర్భంగా తలెత్తిన ప్రోటోకాల్ వివాదాలపై సీఎం మమత శనివారం మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు. బెంగాల్ ప్రజల బాగు కోసం అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకోడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ వ్యక్తిగతంగా నన్ను ఇంత ఘోరంగా అవమానిస్తే మాత్రం సహించబోను. ఎన్నికల్లో మిమ్మల్ని(బీజేపీని) ఛీకొట్టిన బెంగాల్ ప్రజలు మమ్మల్ని(టీఎంసీ) గెలిపించారే దుగ్ధతో ఇలా చేస్తున్నారా? ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయాలేంటి? కక్షలు, ప్రతీకార రాజకీయాలు ఎప్పటికి మానేస్తారు?'' అని ప్రశ్నించారు.

కలైకుండ ఎయిర్ బేస్ లో ప్రధాని ఉన్న చోటికి మేం వెళ్లగా, ఎస్పీజీ సిబ్బంది అడ్డుకున్నారని సమావేశం ప్రారంభమైందని ముగింపుకు మరో గంట పడుుతందని అప్పటి దాకా వెయిట్ చేయాలని చెప్పారని మమత పేర్కొన్నారు. మొదటి పిఎంతో సిఎం కు విడిగా సమావేశం ఉంటుందని చెప్పారని కాని ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో బిజెపి నేతలకు అవకాశం కల్పించారని ఇదేం పద్దతని ప్రశ్నించారు. వారు అడ్డు కోవడం వల్లే తాను తుపాను అంచనా రిపోర్టు  వినతి పత్రాన్ని అందించి వచ్చేశానని తెలిపారు. బెంగాల్ ప్రజలు తనకు భారి మెజార్టి ఇచ్చారని ఇలా అవమాన పరచడం సరికాదని అన్నారు. 

కక్షపూరిత రాజకీయాల కోసం చీఫ్ సెక్రటరీని రీకాల్ చేస్తారా అంటు మండిపడ్డారు. ఓ రాష్ట్ర సిఎఎస్ ను ఇలా అవమానించడం రాష్ట్రాలను, ఫెడరల్ వ్యవస్థను అవమానించినట్లని అన్నారు.  బెంగాల్ సీఎస్ ఆలాపన్‌ బంధోపాధ్యాయను రీకాల్ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు