డీఆర్డీవో యాంటి కరోనా డ్రగ్

 డీఆర్‌డీవో, రెడ్డీస్‌ అభివృద్ది చేసిన యాంటీ- కోవిడ్‌ మందు


ఈ ఔషధాన్ని వాడిన కరోనా రోగులు వేగంగా కోలుకుంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్ నిరూపించినట్టు వెల్లడైంది. 2-డీజీ ఔషధాన్ని తీసుకున్న రోగులకు ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన అవసరం రాలేదని గుర్తించారు. ఈ ఔషధంతో చికిత్స పొందిన కరోనా రోగుల్లో చాలామందికి స్వల్పకాలంలోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తోందని డీఆర్డీవో వెల్లడించింది. వైరస్ పెరుగుదలను ఇది కట్టడి చేస్తోందని తెలిపింది.

భారత అంతరిక్ష పరిశోధన అభివృద్ధి సంస్థ  (డీఆర్డీవో) కరోనా చికిత్స కోసం 2 డీఆక్సీ డి గ్లూకోజ్ అనే ఔషదాన్ని రూపొందించి అందుబాటులోకి తెచ్చింది.  ఈ ఔషధానికి సంక్షిప్తంగా 2-డీజీ గా నామకరణం చేశారు. హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో ఢిల్లీలోని ఐఎన్‌ఎంఏఎస్‌ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్) ల్యాబ్‌ ఔషదాన్ని రూపొందించింది. యాంటీ   కరోనా డ్రగ్‌కు అనుమతి సాధించింది. 

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు గుజరాత్‌కు చెందిన 27 కోవిడ్‌ ఆసుపత్రులలో ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది.  ఈ ఫలితాల వివరణాత్మక డేటాను  డీసీజీఐకి సమర్పించిన నేపథ్యంలో తాజా అనుమతి లభించింది.

క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైన  అద్భుత ఫలితాలు చూసి ఈ డ్రగ్ కు అనుమతి ఇచ్చారు. క్రానిక్ కోవిడ్‌ బాధితుల్లో ఈ మందు అమోఘంగా పని చేస్తుందని, వేగంగా కోలుకోవడంతోపాటు ఆక్సిజన్‌పై అధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుందని డీఆర్‌డీవో ప్రకటించింది. ఈ ఔషధంతో చికిత్స పొందిన కరోనా రోగుల్లో చాలామందికి స్వల్పకాలంలోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తోందని డీఆర్డీవో వెల్లడించింది. వైరస్ పెరుగుదలను ఇది కట్టడి చేస్తోందని తెలిపింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు