నిద్రలేచిన ధర్మ ప్రభువులు

 ఆంక్షలు షురూ.......


మొన్నటి వరకు మన నేతలు ఎన్నికల జాతర్లలో మునిగి తేలారు. కరోనా మహమ్మారికి ప్రమోటర్లుగా మారి జనాలను చావుదెబ్బ తీసారు. మొత్తం దేశాన్ని శవాల దిబ్బల గడ్డగా మార్చారు. ఆసుపత్రుల్లో అవసరాలకు సరిపడా వసతులు లేవు. వైద్యులు లేరు. వైద్య పరికరాలు లేవు. ఔషధాలు అంతకు లేవు. వైద్యరంగానికి ఈ దేశ పాలకులు నిధులు కేటాయించకుండ చేసిన నిర్లక్ష్య ఫలితానికి ప్రజలు భారి మూల్యం చెల్లించాల్సి వస్తోంది. వాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది.
అసలు నిర్వహించాల్సిన విధులు నిర్వహించకుండ ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నారు.

 తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తుంటే ఏ బొరియల్లో దాక్కున్నారో ధర్మ ప్రభువులు కాని ఇప్పుడే నిద్రలేచి నట్లు నటిస్తున్నారు. ఏక్షణంల నైనా సడక్ బంద్ అనవచ్చు. లగ్గాల సీజన్ లో ఆంక్షలు పెట్టారు. చావు కాడ గుమి కూడ వద్దని ఆదేశాలు జారి చేశారు.
ప్రభుత్వం మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని సిద్ధ‌మ‌వుతున్నది. అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధించింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు గరిష్టంగా 100 మందికి మించవద్దని.. అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో 20 మందికి మించవద్దని స్పష్టం చేసింది. అదికూడా మాస్కులు, భౌతిక దూరం, ఇతర కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ చట్టంఉ2005 కింద ఆంక్షలను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
చేయాల్సింది ఆంక్షలు విధించి చేతులు దులుపుకోవడం కాదు. ఆసుపత్రులలో మౌలిక వసతులు పెంచడం. అందరికి వాక్సిన్లు అందుబాటు లోకి తేవడం. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడి అరికట్టడం జరగాలి. కరోనా భాదితుల వైద్యచికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు