కరోనా వైద్య సేవల కోసం ఎంబిబిఎస్ వైద్యుల నియామకం


 కరోనా వ్యాప్తి శర వేగంగా జరుగుతుండడంతో భాదితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రైవేట్ అసుపత్రుల్లో ఫీజుల మోత మోగిస్తున్నారు. సామాన్యులెవరు ప్రైవేట్ అసుపత్రుల్లో చేర లేని పరిస్థి ఉంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, బెడ్ల కొరత ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ పరిస్థితులు అదిగమించేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణం వైద్యుల కొరత తీర్చేందుకు ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారి సేవను వినియోగించాలని నిర్ణయించారు. రాష్ర్టంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 50 వేల మంది వైద్యులు ఎంబిబిఎస్ పూర్తి చేసారు. వీరిని స్వల్ప కాలం కోసం కరోనా వైద్యసేవలకు నియమించాలని నిర్ణయించారు. ఎబిబిఎస్ పూర్తి చేసిన వారు ఆల్ నైను ద్వారా   https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

స్వల్ప కాలం కోసం నియమించే వారికి మంచి గౌరవ వేతనాలు ఇవ్వనున్నారు. భవిష్యత్ లో జరిగే ప్రభుత్వ నియామకాలకు వెయిటేజ్ మార్కులు కూడ ఇస్తారు.  తక్షణం రాష్ర్టంలో వైద్యుల కొరత తీర్చేందుకు స్వల్ప కాల పరిమితి కోసం వీరి నియామకాలు  జరగనున్నాయి. వీరి సేవను గ్రామీణ ప్రాంతాల్లో కూడ వినియోగించనునున్నారు.

కరోనా వైద్య సేవలలో ప్రభుత్వ వైద్యులపై అత్యధిక బారం పడుతోంది. నిర్విరామంగా గత ఏడాది కాలానికి పైగా వైద్య సేవలు అందిస్తున్నారు. చాలా మంది వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా భారిన పడుతున్నారు. దాంతో ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది.

సూపర్ స్పెషాల్టి ఆసుపత్రులు తక్షణం ప్రారంభం

వరంగల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ మెడికల్ కాలేజి పీఎంఎస్ఎస్‌వై కింద మిర్మించిన సూపర్ స్పెషాల్టి ఆసుపత్రిని తక్షణం ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. వరంగల్ తో పాటు ఆదిలాబాద్ రిమ్స్ లో కూడ  సూపర్ స్పెషాల్టి ఆసుపత్రి నిర్మించారు. వీటిలో 250 పడకల కెపాటిసి ఉంది. వీటికి అవసరం అయిన వైద్యులను , వైద్య సిబ్బందిని నియిమంచాలని సూచించారు.  వరంగల్ లో మెడికల్ కాలేజి ఆవరణలో నిర్ిమంచిన ఆసుపత్రికి 8 కోట్లతో పాటు ఆదిలాబాద్ ఆసుపత్రికి 20 కోట్లు తక్షణం విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. అదే విదంగా ఈ ఆసుత్రుల కోసం మెత్తం 729 సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు