బాత్ రూమే ఐసోలేషన్ గది

  వికారాబాద్ జిల్లాలో  ఓ కరోనా పేషెంట్ అతి జాగ్రత్త

ఐసోలేషన్ కాంపుకు తరలించిన అధికారులు


జనాల్లో కరోనా భయాందోళనలు మామూలుగా లేవు. అతిగా భయ పడే వారు ఉన్నట్లే  భయం లేకుండా తిరిగే వారు కూడ ఉన్నారు.  కరోనా సోకిన వారు ఇండ్లలోనే ఉండి  చికిత్స  పొందాలని ప్రభుత్వం చెబుతుంటే  వికారాబాద్ జిల్లా ధారూరు మండలం లోని మైలారం గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి బాత్ రూమునే తన తన ఐసోలేషన్ గదిగా చేసుకున్నాడు. కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో అశోక్ తన కుటుంబ సబ్యులకు దూరంగా ఉండేందుకు ఇంటికి కొద్ది దూరంలో ఉండే బాత్ రూమును ఐసోలేషన్ గదిగా మార్చుకుని అంతటితో ఊరుకోకుండా ఓ సెల్ఫి కూడ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసాడు. అది కాస్తా  వైరల్ అయింది. అయితే అశోక్ మాత్రం వీడియోను ఎవరిని ఇబ్బంది పెట్టేందుకు పోస్టు చేయ లేదని చెబుతున్నాడు. వీడియో చూసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గ్రామ సర్పంచ్ తో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాడు. అశోక్ ను ఇంట్లోనే ఓ గదిలో ఉండమని సలహాలివ్వగా ఇందుకు ఆయన అంగీకరించలేదు. అశోక్ కు ఒక్కటి కాదు రెండు ఇండ్లు ఉన్నట్లు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ సబ్యులు కూడ అశోక్ ను ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉండాలని కోరినా విన లేదు. దాంతో గ్రామ సర్పంచ్ సూచన మేరకు అశోక్ ను అధికారులు  అనంతగిరిగుట్టలోని ఐసోలేషన్‌  సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు