ఏ2 గా టీవీ5, ఏ3 గా ఏబీఎన్

రఘురామకృష్ణం రాజు కేసులో మీడియా ఛానెళ్లపై సిఐడి  చార్జి షీటు


వైఎస్ఆర్ సిపి రెబల్ ఎంపీ  రఘురామకృష్ణంరాజు కు హై కోర్టులో చుక్కెదురు అయింది. తనను అక్రమ అరెస్ట్ చేశారంటూ బెయిల్ కోసం వేసిన పటిషన్ ను హై కోర్టు తిరస్కరించింది. కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేయకుండా పై కోర్టుకు ఎట్లా వస్తారని ప్రశ్నించింది.  

ఇదిలా ఉంటే ఎంపి రఘురామ కృష్ణం రాజు కేసులో మీడియా ఛానెళ్ళను కూడ నిందితులుగా చేర్చారు.  టీవీ5, ఏబీఎన్ ఛానెళ్లపై సీఐడీ కేసులు నమోదు చిసింది. రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి, అతడ్ని సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు ఆయన చెప్పిన వివరాలు ఆధారంగా ఏ2 గా టీవీ5 ఛానెల్ ను, ఏ3 గా ఏబీఎన్ ఛానెల్ ను చేరుస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

ఈ రెండు ఛానెళ్లు కలిసి కావాలనే కుట్రపూరితంగా రఘురామకృష్ణంరాజును బాగా రెచ్చగొట్టాయని ప్రభుత్వంపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేలా ఉసిగొల్పాయని సీఐడీ అధికారులుచార్జి షీటులో అభియోగాలు మోపారు.  ఏబీఎన్, టీవీ5 ఛానెళ్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ముఖ్యమంత్రి జగన్ పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రఘురామకృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల కేసును తాము సుమోటాగా తీసుకున్నామని సీఐడీ అధికారులు వెల్లడించడం విచిత్రం. ప్రభుత్వంపై  విమర్శలు చేస్తే కేసులు నమోదు చేయడం కొత్తేమి కాక పోయినా ఓ వైపు కరోనా సమస్య రాష్ట్రంలో ఉధృతంగా ఉండి జనం అతలా కుతలం అవుతుంటే మరో వైపు రఘురామకృష్ణం రాజు సమస్య  ఎపి సిఐడి పోలీసులకు అత్యవసర సమస్యగా మారి సుమోటో కేసుగా స్వీకరించాలని స్పురణకు రావడం మరి విచిత్రం. సిఐడి మోపిన అభియోగాలు కూడ విచిత్రంగా ఉన్నాయి. రెడ్డి, క్రిస్టియన్ సామాజిక వర్గాల్ని లక్ష్యంగా చేసుకొని ఆ వర్గాల మధ్య చిచ్చు రేపడానికి రఘురామకృష్ణంరాజు ప్రయత్నించారని సీఐడీ   అభియోగాల్లో పేర్కొంది.

ఈ వార్తలను  ప్రసారం చేసి ప్రజల మద్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు మీడియా హౌజ్ లు ప్రయత్నించాయని సిఐడి పేర్కొంది.  వివాదాస్పద వ్యాఖ్యల్ని ప్రసారం చేసేందుకే ఈ ఛానెళ్లు ప్రత్యేకంగా స్లాట్స్ కేటాయించాయని సిఐడి ఆరోపించింది. 

హై కోర్టుసీరియస్ 

రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మెజిస్ట్రేట్ కోర్టులో ఏం జరిగిందో తెలుసుకుని అరగంటలో ఉత్తర్వులిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే రఘురామకు కేంద్రం కల్పించిన వై కేటగిరి భద్రత కొనసాగించాలని ఆయన తరపు న్యాయవాది సీనియర్ లాయర్ ఆదినారాయణరావు కోరారు. రఘురామ కుటుంబ సభ్యులను కూడా అనుమతించాలని కోరారు. అలాగే మెడికల్ కోర్టు నివేదిక రేపు ఉదయం 10:30లోపు ఇచ్చేలా చూడాలని కోర్టును కోరారు.
రఘురామను సీఐడీ పోలీసులు కొట్టారని, ఆయన నడవలేక పోతున్నారని, న్యాయవాది ఆదినారాయణరావు అంతకుముందే హైకోర్టుకు రాసిన లేఖలో తెలియజేశారు. దీనిపై మెడికల్ కోర్టు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు