కరోనా రోగి మృత దేహాన్ని నదిలో విసిరేసారు

ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసిన ఘోరం


ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఇటీవల గంగా నదిలో కరోనా మృత దేహాలు కల కలం రేపాయి. ప్రతి రోజు వేల సంఖ్యలో మృతి చెందుతున్న  కరోనా రోగులకు స్మశాన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు క్యూలలో వేచి చూడాల్సి వస్తోంది. మృత దేహాలను తీసుకు వెళ్లడంలో అంబులెన్సులు కూడ దొరకక చివరికి టూ వీలర్లపై కూడ తీసుకు వెళ్లి అంత్యక్రియలు జరిపిస్తున్న సంఘటనలు కూడ ఉన్నాయి.  అయితే కొందరు ప్రబుద్దులు కరోనాతో చనిపోయిన రోగులను దిక్కు లేని వారిగా చేస్తున్నారు. 

ఉత్తర ప్రదేశ్ లో కరోనాతో మృతిచెందిన ఓ వ్యక్తి శవానికి అంత్యక్రియలు నిర్వహించ లేక ఓ నదిలో విసిరేసారు. బలరాంపూర్‌లో మే 28న రప్తి నది బ్రిడ్జి దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పిపిఇ కిట్ ధరించగా మరో వ్యక్తి సాధారాణ దుస్తుల్లో కనిపించారు. జోరు వాన కురుస్తుండగా  కరోనా మృత దేహాన్ని రప్తి నదిలో విసిరేసారు. ఈ దృష్యాన్ని దారిలో వెళుతున్న వారు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.  సోషల్ మీడియాలో వీడియో బాగా వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. 

బలంపూర్ వైద్యాధికారులు ఈ విడియోపై క్లారిటి ఇచ్చారు.  ఓ వ్యక్తిని కరోనా పాజిటివ్ ఉందని ఆసుపత్రిలో మేనెల 25 న చేర్పించారు. చికిత్స జరుగుతుండగా ఆ వ్యక్తి చనిపోయాడు. దాంతో మేనెల 28 న మృత దాహాన్ని  వారి భందువులకు అప్పగించామని వైద్యాధి కారులు తెలిపారు. ఇంటికి దగ్గర పరిస్థితి ఏమిటో ఎందుకు ఖర్చు అనుకున్నారో కాని మార్గ మద్యంలో రప్తి నది వద్దకు  రాగానే మృత దేహాన్ని నదిలో కి విసిరేసారు. 

ఈ ఘటనపై బలరాంపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వీబీ సింగ్ మీడియాతో మాట్లాడారు. స్మశాన వాటికకు తీసుకువెళ్లకుండా నదిలోకి శవాన్ని విసిరి వేసిన ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. విచారణ అనంతరం కుటుంబ సబ్యులపై  ఖఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గంగా నదిలో ఒడ్డుకు ప్రతినిత్యం ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సరిహద్దుల్లో మృత దేహాలు కొట్టుకు వస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ నుండే ఇవి కొట్టుకు వస్తున్నాయని బీహార్ రాష్ట్రం ఆరోపిస్తోంది. గంగా నది ఒడ్డున ఇరుపక్కల మృత దేహాలను పూడ్చి పెడుతున్నారు. అవి నీటి ప్రవాహంలో తేలి నదిలో కొట్టుకు పోతున్నాయి. అంత్యక్రియలు జరపడం ఖర్చుతోను, కాలయాపనతోను కూడుకున్న పని అని అంత్యక్రియుల జరపక పోయినా నదిలో వేస్తే సరిపోతుందని భావించి ఇలా కొందరు శవాలను నదిలో వదిలేస్తున్నట్లు చెబుతున్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు