మరో 10 దినాలు లాక్ డౌన్ పొడిగింపు


 రాష్ట్రంలో మరో 10 దినాల పాటు లాక్ డౌన్ పొడిగించారు. అయితే సడలింపును మరో మూడుగంటల పాటు పెంచారు.  ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపులు ఇచ్చారు. సడలింపు తర్వాత మరో గంట పాటు బయటికి వెళ్లిన వారు ఇండ్లకు చేరేందుకు మినహాయింపు నిచ్చారు. 

రాష్ట్రంలో లాక్ డౌన్ విధించినప్పటి నుండి కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారం ప్రగతి భవన్లో జరిగిన మంత్రి వర్గం సమావేశంలో లాక్ డౌన్ తో పాటు వ్యవసాయ రంగ పరిస్థితులపై కూడ చర్చించారు. రైతు భందు పథకం కింద రైతులకు ఇచ్చే సహాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయ నున్నారు. 

కాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్్రి కెటిఆర్ ట్వీట్ చేసారు.  తెలంగాణలో మరో 7 మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కాలేజీలన్నీ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోనే ఏర్పాటు చేయనున్నారు. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలకు కొత్త మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. తెలంగాణ రాకముందు ఇక్కడ కేవలం 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 కొత్త కాలేజీలు ఏర్పాటు చేశారు. తాజాగా మరో 7 కాలేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్రవేసింది.

అట్లాగే  ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని కేబినెట్‌ నిర్ణయించింది. కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికి.. ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తేస్తే కేసులు పెరిగే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి భూమి, వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అన్నిరకాల కార్యకలాపాలను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. 





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు