ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ అధ్యయనం

 కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై జోక్యం చేసుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అధ్యయం చేపట్టాలని ఆయుష్ అధికారులను  ఆదేశించిన ఉప రాష్ట్ర పతి



అల్లోపతి మందులకు లొంగని కరోనా రోగాన్ని నయం చేసే కృష్ణపట్నం ఆయుర్వేద మందు సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయర్వేద వైద్యుడు కరోనా కు చెట్ల మందును ఇచ్చి చాలా మంది పేషంట్లను నయం చేశాడు. ఈ విషయం చుట్టుపక్కల దావాణంలా వ్యాపించి వేలాది మంది మందు కోసం బారులు తీరారు. మందు సరఫరా చేయ లేక పోవడంతో పాటు మరోవైపు బారులు తీరిన క్యూలైన్లను అదుపు చేయడం సమస్యగా మారింది. ఈ మందుపై స్థానికంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని జోడించి జిల్లా కలెక్టర్ ప్రబుత్వానికి ఓ నివేదిక కూడ ఇచ్చారు. ఆనందయ్య ఇచ్చిన మందుతో సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేవని నివేదికలో పేర్కొన్నాడు.

ఆనందయ్య మందు బాగా పనిచేస్తోందని కరోనా పేషెంట్లు మీడియా కు ప్రత్యక్షంగా చెప్పారు. శుక్రవారం నుండి మందు పంపిణి చేసేందుకు సన్నాహాలు జరగగా వేలాది మంది రావడంతో రద్ది సమస్య కారణంగా మందు పంపిణి నిలిపి వేశారు. తిరిగి పెద్ద ఎత్తున మందు తయారు చేసి పంపిణి చేస్తామని ప్రకటించారు. 

కృష్ణపట్నంకు ఐసీఎంఆర్ టీమ్‌

కృష్ణపట్నం  ఆయుర్వేద మందు విషయం ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు దృష్టికి వెళ్లడంతో  అధ్యయనం చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించాడు.  ఆయుష్ ఇన్‌చార్జ్‌ మంత్రి కిరణ్ రిజ్జు, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్‌కు ఆయన  సూచించారు.  దీనిపై వెంటనే అధ్యయనం ప్రారంభించి వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

 ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. శక్రవారం నుంచి మళ్లీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసినప్పటికి రద్ది సమస్య ఏర్పడడంతో పంపిణి నిలిపి వేశారు.

కృష్ణపట్నం మందుపై అధ్యయనంలో ఫలితాలు ఎలా ఉన్నా ఈ మందు వాడిన వారు చెప్పిన విషయాలను బట్టి చాలా అద్భుతాలు జరిగినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒక వేల మందు సత్ఫలితాలు ఇచ్చినట్లు అధ్యయనాల్లో శాస్త్రీయంగా రుజువు అయితే అనందయ్య ఆయుర్వేద మందు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అవుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు