ఆనందయ్య ఆయుర్వేద ప్రజావైద్యం పై అల్లోపతి సామ్రాజ్యవాదుల దాడి

 'ఆనందయ్య ఆయుర్వేద వైద్యం' పై అల్లోపతి వైద్యుల దాడిని ప్రత్యామ్నాయ ప్రజా వైద్య విధానాలపై 'అల్లోపతి సామ్రాజ్యవాదుల దాడి'గానే చూడాలి, ఎదిరించాలి...
( రాసింది డాక్టర్ జిలకర శ్రీనివాస్, దానికి పై హెడ్డింగ్ ఇచ్చింది వి.మ్.క్రిష్ణా రెెెడ్డి)


అల్లోపతి ప్రోటోకాల్ ను ఎవరు నిర్దారించారు? రెమిడెసివిర్, అజిత్రోమైసిన్, ఇంకా సోకాల్డు మందులకు సైడ్ ఎఫెక్ట్స్ లేవా? బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వల్ల చనిపోతలేరా? ఆనందయ్య మందువల్ల ఎవరికీ బ్లాక్ ఫంగస్ రాలేదే? మీరు తయారు చేసిన కరోనా టెస్ట్ లు, సిటి స్కాన్ లు ఇతర టెస్ట్ లు ఉన్నాయి కదా. ఆనందయ్య ఇచ్చే మందు ఇవ్వడం ముందు రోగి టెస్ట్ రిపోర్టులు, మందు వేసిన తరువాత రోగి రిపోర్ట్ లు చూడండి. అదే కదా, డేటా అనాలిసిస్ అంటే.
ఇక కళ్లలో మందు వేయడం ద్వారా మెదడును ఉత్తేజితం చేయడం ద్వారా శరీరం లోపలి అవయవాలను బాగా పని చేసేలా చేసే వైద్య చికిత్స విధానం ఆయుర్వేదంలో వుంది. చరక సంహిత, అష్టాంగ హృదయ అనే ప్రాచీన గ్రంథాలలో పేర్కొన్నారు. ఈ టెక్నిక్ కొత్తదేమీ కాదు. అక్యూ పంక్చర్ లో మెదడును, లంగ్స్ పనితీరు మెరుగు పరచడానికి ప్రెస్సింగ్ పాయింట్లు, పంక్చర్ పాయింట్లు కాళ్లలో, అర చేతుల్లో, వీపులో ఇంకా చాలా చోట్ల ఉంటాయి. వేళ్లకు పంక్చర్ చేస్తే లేదా నొక్కితే ఎలా రోగం నయం అవుతుంది అని అడిగితే, అది అల్లోపతి అమాయకత్వం అవుతుంది తప్పా, అక్యు ప్రెషర్ విధానం తప్పు కాదు. ఆయుర్వేదం గురించి ఏమి తెలియని అల్లోపతి డాక్టర్లు అది తప్పని తీర్పు లివ్వడం సిగ్గులేనితనం. నేరుగా వాక్సిన్ల పేరుతో, రెమిడెసివిర్ల పేరుతో పేషెంట్ల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న అల్లోపతి వైద్యులు, ఆనందయ్య వైద్యానికి మాత్రం ట్రయల్స్ కు ఎవరు అనుమతి ఇచ్చారు అంటున్నారు? రోగులకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎలా అనీ తెగ బాధపడిపోతున్నారు. ఇది గడుసుతనం అంటే.
ఫార్మా, హెల్త్ ఇండస్ట్రీ ప్రయోజనాలు కాపాడటానికి అల్లోపతి డాక్టర్లు మాట్లాడుతున్నారు. ఆనందయ్య తన మందు తయారీలో వాడుతున్న ప్రతి దినుసు మన యింట్లో వాడేదే. ఇక తెల్ల గన్నేరు అనేది. అనేక పాషాణాలను అంటే విషాలను వైద్యంలో వాడటం ఆయుర్వేదంలో వేల యేళ్లుగా వుంది. అల్లోపతి లో కూడా వుంది. హోమియోలో కూడా వుంది. కనకసావ అనే ఆయుర్వేద సిరప్ ను కూడా తెల్ల గన్నేరు నుండి తయారు చేస్తారు. అది లంగ్స్ ఇన్ఫెక్షన్ ను అస్తమాను అద్భుతంగా తగ్గిస్తుంది.
మనకు తెలియని విషయాల మీద జడ్జిమెంట్లు ఇచ్చే అతి తెలివిని అల్లోపతి డాక్టర్లు చూపించ కూడదని నా రిక్వెస్ట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు