భాద్యతలు స్వీకరించిన నూతన కమీషనర్ తరుణ్ జోషి

నేరాలను నియంత్రించడమే నాలక్ష్యం
-నూతన వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి


వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ తరుణ్ జోషి బుధవారం భాధ్యతలు స్వీకరించారు. అనంతరం వరంగల్ కమిషనరేట్ కు చెందిన పలువురు పోలీస్ అధికారులు కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు అంద జేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మీడియా తో మాట్లాడుతూ గతంలో ఈ జిల్లాలో పనిచేసిన అనుభవం వుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పారదర్శకంగా వ్యవహరిస్తానని అ్ననారు. ప్రధానంగా  కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి సమస్యలపై  దృష్టి పెట్టడం జరుగుతుందని అన్నారు.  అదే విధంగా మావోస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టడం జరుగుతుందని మున్సిపల్ ఎన్నికలను ప్రశాంథంగా విజయంగా నిర్వహించడమే తన ముందున్న లక్ష్యమని అన్నారు. 

కమీషనరేట్ కార్యాలయానికి చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్ కు సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం తన ఛాంబర్ పోలీస్ కమిషనర్  వరంగల్ కమిషనర్ గా భాధ్యతలు స్వీకరిస్తూ దస్త్రాలపై కమీషనర్ సంతకం చేశారు. అనంతరం  ఐ.జీ ప్రమోద్ కుమార్ ను కమీషనర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు