బలిదానాలు వద్దు బరిగీసి కొట్లాడుదాం

 ప్రజాకాంక్ష-తెలంగాణ 
విద్యార్థి అమరుల ఆశయసాధన దీక్ష లో నాయకుల పిలుపు

 


  నిరుద్యోగులకు  వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ లో బలిదానాలు చేసుకున్న విద్యార్థి నిరుద్యోగ అమరుల ఆశయ సాధన కోసం విద్యార్థి సంఘాలు బుధవారం చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష కు వివిధ ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.

విద్యార్థి సంఘాలు చేపట్టిన దీక్షకు బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు వివేక్, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ గజ్జెల మల్లేష్, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోరిక ఈశ్వర్ సింగ్ నాయక్, ట్రైబల్ డెమొక్రటిక్ ఫ్రంట్ నాయకులు ఉదయ్ సింగ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈసంపెళ్లి వేణు, బి.సి జాక్ నాయకులు తిరుణహరి శేషు, ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనువాస్ గౌడ్, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు చిల్ల రాజేంద్రప్రసాద్, ట్రైబల్ ఎంప్లాయిస్ జాక్ నాయకులు రాందాస్, మానవ హక్కుల వేదిక నాయకులు రాజు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆకుల సుమన్, జనసేన విద్యార్థి విభాగ నాయకులు సంపత్ నాయక్, అధ్యాపకురాలు సాహితి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

    బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ పార్లమెంటు కన్వీనర్ సాయిని నరేందర్ మాట్లాడుతూ  కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో చేసిన తప్పులను, నాన్చుడు ధోరణిని ప్రశ్నించిన చరిత్ర గల కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర వహించిందని అలాంటి కాకతీయ యూనివర్సిటీ నేడు జరిగే తెలంగాణ పునర్ నిర్మాణ ఉద్యమంలో, ఉద్యోగ,  ఉపాధి అవకాశాల కల్పన ఉద్యమంలో ముందుడడం అభినందనీయ మని నరేందర్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినానాదంతో జరిగిన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు బలిదానాలు చేసుకున్నారని తెలంగాణ ఏర్పడిన ఉద్యోగాలు రాకపోవడంతో వయసు మీరి, కుటుంబాలకు భారమై నేడు తెలంగాణ యువత ఆందోళనలో ఉన్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయాలని, విద్యార్థి ఉద్యమాలపై పోలీసు నిర్బందాన్ని తొలిగించాలని అన్నారు. తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకోసం బలిదానాలు వద్దని బరిగీసి కొట్లాడాలని తెలంగాణ ఉద్యమంలో ముందున్నట్లుగానే  నిరుద్యోగులకు అండగా బహూజన లెఫ్ట్ ఫ్రంట్ ఉంటుందని ఆయన అన్నారు.

     దీక్షలో విద్యార్థి సంఘాల నాయకులు బండిగ రాకేష్, ఎం.సావిత్రి, జి. గౌతమ్, గడ్డం నాగార్జున, వినోద్ లోక్ నాయక్, ఉషన్ నాయక్, ఎట్టబోయిన భిక్షపతి, భూక్య వెంకట్, బొట్ల మనోహర్, దండేపల్లి సురేందర్, సూర్య, బి. నాగరాజు, కార్తీక్, గుగులోత్ రాజు నాయక్, డాక్టర్ ఎం.ఎస్.ఎన్ రాజు పటేల్, టి.సాంబశివరావు, డాక్టర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

   

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు