మావోల చెరలో రాకేశ్వర్ సింగ్ సేఫ్

 ఫోటో రీలిజ్ చేసిన మావోయిస్టులు
వదిలి పెట్టాలని వేడుకున్న రాకేశ్వర్ సింగ్ భార్య


బీజాపూర్ దాడి ఘటనలో మావోయిస్టులు బందీగా పట్టుకున్న  సిఆర్ పిఎఫ్ జవాను రాకేశ్వర్ సింగ్ క్షేమంగా  ఉన్నట్లు మావోయిస్టులు ఫోటో రిలీజ్ చేసారు. ఓ గుడిసెలో పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తున్న  రాకేశ్వర్ సింగ్ ఫోటోను విడుదల చేసారు. ఫోటోను  పరిశీలిస్తే  ఆయన ఒంటిపై గాయాలు అయితే ఏవి కనిపించ లేదు. చర్చలకు వచ్చే మద్యవర్తులు ఎవరో వారి పేర్లు  ప్రకటిస్తే రాకేశ్వర్ సింగ్ ను క్షేమంగా విడుదల చేస్తామని మావోయిస్టులు ఇది వరకే ప్రకటించారు.  

ఏప్రిల్ 3 వ తేదీన బీజాపూర్ లో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మంది గాయపడ్డారు. కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ మిస్ అయ్యాడు. అయితే మావోలు అతనని బందీగా పట్టుకున్నట్లు ఆ తర్వాత రెండు రోజులకు  ప్రకటించారు. 

జమ్మూ, కశ్మీర్ సిఆర్ పిఎఫ్ బాయాలియన్ కు చెందిన రాకేశ్వర్ సింగ్ ను వదిలి పెట్టాలని అతని భార్య మీను  మావోయిస్టులకు విజ్ఞప్తి చేసారు. తన భర్తను విడిపించేందుకు మద్యవర్తులను ఏర్పాటు చేయాలని ఆమె పోలీసు ఉన్నతాాధి  కారులను కోరారు. సెలవు పై వెళ్ళిన జావాన్లు  24 గంటల లోపు  డ్యూటీకి హాజరు కాకుంటే క్రమ శిక్షణ చర్యలు తీసుకునే అధికారులు తన భర్తను మావోయిస్టులు బందీగా పట్టుకుని ఇన్నిరోజులు గడిచి పోయినా  ఎందుకు వెంటనే స్పందించటం లేదని పట్టించు కోవటం లేదని ప్రశ్నించారు.  వెంటనే మద్యవర్తులను ఏర్పాటు చేసి తన భర్తను విడిపించాలని కోరారు.

బీజాపూర్  దాడిలో నక్సలైట్లవైపు నుండి కూడ ఎక్కువ ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని పోలీసు అధికారులు భావించారు కాని నలుగురు మాత్రమే చనిపోయారని మావోయిస్టులు స్వయంగా ప్రకటించారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు